భారత్-దక్షిణాఫ్రికా మహిళల మధ్య నేటి నుంచి టెస్ట్ మ్యాచ్.. పదేళ్ల తర్వాత తొలిసారి

భారత్ - దక్షిణాఫ్రికా మహిళ క్రికెట్ జట్ల మధ్య శుక్రవారం నుంచి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. పదేళ్ల తర్వాత తొలిసారి ఈ రెండు జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతోంది. చివరిసారిగా 2014లో మైసూరులో ఆడిన టెస్టులో భారత మహిళల జట్టు 34 పరుగులు తేడాతో నెగ్గింది. భారత మహిళ క్రికెట్ సిరీస్ లో క్రమం తప్పకుండా టెస్టులు లేని నేపథ్యంలో ఆటగాళ్లు ఎలా ఆడతారు అన్నదానిపై ఆసక్తి నెలకొంది. సఫారీలతో ఈ మ్యాచ్ లో ఐదుగురు క్రీడాకారులు అరంగేట్రం చేసేందుకు ఎదురుచూస్తున్నారు.

India - South Africa Women's Cricket Teams

భారత్ - దక్షిణాఫ్రికా మహిళ క్రికెట్ జట్ల 


భారత్ - దక్షిణాఫ్రికా మహిళ క్రికెట్ జట్ల మధ్య శుక్రవారం నుంచి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. పదేళ్ల తర్వాత తొలిసారి ఈ రెండు జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతోంది. చివరిసారిగా 2014లో మైసూరులో ఆడిన టెస్టులో భారత మహిళల జట్టు 34 పరుగులు తేడాతో నెగ్గింది. భారత మహిళ క్రికెట్ సిరీస్ లో క్రమం తప్పకుండా టెస్టులు లేని నేపథ్యంలో ఆటగాళ్లు ఎలా ఆడతారు అన్నదానిపై ఆసక్తి నెలకొంది. సఫారీలతో ఈ మ్యాచ్ లో ఐదుగురు క్రీడాకారులు అరంగేట్రం చేసేందుకు ఎదురుచూస్తున్నారు. ఉమా చేత్రి, ప్రియా పూనియా, సైకా ఇషాక్, తెలుగు క్రికెటర్లు అరుంధతి రెడ్డి, షబ్నమ్, షకిల్ ఉన్నారు. మరోవైపు భారత జట్టు చివరిసారి గత డిసెంబర్లో టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన ఒక్కో టెస్ట్ లో మనోళ్లు విజయం సాధించారు. దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ లో బ్యాటింగ్ తో అదరగొట్టిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, వైస్ కెప్టెన్ స్మృతి మందాన అదే జోరు కొనసాగిస్తారని భారత్ భావిస్తోంది. ఇంగ్లాండ్, ఆసీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన జమీమా కూడా చెత్తా చాటాల్సి ఉంది. ఇక సఫారీ వర్మ దీప్తి శర్మ ప్రస్తుతం టెస్టుల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లుగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. వీరు కూడా బ్యాట్ ఝులుపిస్తే భారత్ కు తిరుగు ఉండదు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లను వణికించిన దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ ఆ ప్రదర్శనను పునరావృతం చేస్తారని భారత జట్టు ఆశిస్తోంది. చెపాక్ పిచ్ స్పిన్ కు అనుకూలించడంతో స్నేహ్ రాణా ఆఫ్ స్పిన్ ను ఎదుర్కోవడం సఫారీలకు సవాలే. రెండేళ్లలో కేవలం ఒకే టెస్ట్ ఆడిన సౌతాఫ్రికా జట్టులో కూడా ఐదుగురు క్రికెటర్లు ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కెప్టెన్ వాల్వార్ట్, ఆల్రౌండర్లు సూనే లుస్, డెల్మీ టకర్, బౌలర్లు క్లాస్, అనేకా బాష్ , మ్లాబా కీలకం కానున్నారు. చెపాక్ పిచ్ పై 1976లో ఏకైక మహిళా టెస్ట్ మ్యాచ్ జరిగింది. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. శుక్రవారం ఉదయం 9:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 

ఇది జట్లు అంచనా 

భారత జట్టు : హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మందాన, సఫాలీ వర్మ/ప్రియా పునియ, శుభ సతీష్, జేమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(కీపర్), దీప్తి శర్మ, స్నేహ్ రాణా, అరుంధతి రెడ్డి, పూజా వస్త్రాకర్/రేణుక ఠాకూర్, రాజేశ్వరి గైక్వాడ్ 

దక్షిణాఫ్రికా జట్టు : 

లారా వాల్వర్ట్ (కెప్టెన్), అనేకా బాష్, సునే లూస్, తజ్మీన్ బ్రిట్స్, మరిజానే కాప్, డెల్మీ టకర్, డి క్లర్క్, సినాలొ జాఫ్టా, మ్లాబా, మసబాటా క్లాస్, టుమి శేఖుకూనే/డేర్క్ సెన్


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్