తిరుగులేని విరాట్ కోహ్లీ.. కెరీర్‌లో 81 వ అంతర్జాతీయ సెంచరీ

IND vs AUS Test : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. పెర్త్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు.

virat kohli

ప్రతీకాత్మక చిత్రం

IND vs AUS Test : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. పెర్త్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును సృష్టించాడు. టెస్టుల్లో కోహ్లీ తన 30వ అంతర్జాతీయ సెంచరీని సాధించాడు. మొత్తంగా కోహ్లీ కెరీర్‌లో ఇది 81వ సెంచరీ. చాలా కాలం తర్వాత ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ.. ఫ్యాన్స్‌కు కావాల్సినంత వినోదం అందించాడు. సూపర్ బ్యాటింగ్‌తో అలరించాడు. 143 బంతుల్లో 69.93 స్ట్రైక్ రేట్‌తో 8 ఫోర్లు, 2 సిక్సులు బాది నాటౌట్‌గా నిలిచాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో అత్యధిక సెంచరీలు (9) బాదిన క్రికెటర్ కోహ్లీయే. ఈ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు రికార్డు కోహ్లీ పేరిటే ఉంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీల రికార్డును అందుకోవ‌డానికి విరాట్ కోహ్లీ మ‌రో సెంచ‌రీతో ముందుకు వచ్చాడు. ఇప్పుడు 81వ సెంచ‌రీని కొట్టాడు. క్రికెట్ హిస్టరీలోనే భార‌త లెజెండ్, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచ‌రీల‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా 100 సెంచరీలు చేసిన ఏకైక‌ ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ త‌ర్వాత రెండో ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ. కోహ్లీ త‌ర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 71 సెంచరీలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీలో ఇంకా క్రికెట్ చాలా దాగి ఉన్నందున సచిన్ రికార్డులను కోహ్లీ అధిగమిస్తాడని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్