టీమిండియాకు స్టార్ క్రికెటర్, ఓపెనర్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న ధావన్.. వీడ్కోలు పలుకుతూ తీసుకున్న నిర్ణయాన్ని వీడియో ద్వారా వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఈ వీడియో ద్వారా క్రికెట్ ప్రపంచానికి విషయం తెలిసింది. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్‌లో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్టు వీడియోలో శిఖర్ ధావన్ పేర్కొన్నారు.
శిఖర్ ధావన్
టీమిండియాకు స్టార్ క్రికెటర్, ఓపెనర్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న ధావన్.. వీడ్కోలు పలుకుతూ తీసుకున్న నిర్ణయాన్ని వీడియో ద్వారా వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఈ వీడియో ద్వారా క్రికెట్ ప్రపంచానికి విషయం తెలిసింది. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్‌లో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్టు వీడియోలో శిఖర్ ధావన్ పేర్కొన్నారు. శిఖర్ ధావన్ 14 ఏళ్లపాటు ఇండియా జట్టుకు వన్డే, టీ20, టెస్ట్ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆడడం ద్వారా క్రికెట్ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఇన్నేళ్ల తన క్రికెట్ ప్రయాణంలో చాలా గర్వంగా ఉందంటూ వీడియోలో శిఖర్ ధావన్ ఎమోషన్ అయ్యాడు. తన ప్రయాణంలో ఎంతో మంది సహాయం చేశారని, వారి వల్ల ఈ స్థాయి వచ్చినట్టు ధావన్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐ, డీడీసీఏ, అభిమానులకు ధావన్ కృతజ్ఞతలు తెలియజేశాడు.
జట్టుకు అనేక విజయాలు
టీమిండియాకు అనేక మ్యాచ్‌లు ఆడిన శిఖర్ ధావన్ గొప్ప విజయాలను అందించి పెట్టాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగే ధావన్ దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెడుతుంటాడు. అనేక మ్యాచుల్లో కీలక ఇన్సింగ్స్‌లు ఆడి అద్భుత విజయాలను జట్టుకు అందించాడు. ఇప్పటి వరకు శిఖర్ ధావన్ 167 వన్డే మ్యాచ్‌లు, 34 టెస్ట్ మ్యాచులు, 68 టీ20 మ్యాచులను శిఖర్ ధావన్ ఆడాడు. శిఖర్ ధావన్ ఇప్పటి వరకు 34 టెస్ట్ మ్యాచులు ఆడగా 40.61 సగటుతో ఏడు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు సహా 2,315 పరరుగులు చేశాడు. ఇందులో అత్యధికంగా 190 పరుగులు చేశాడు. ఇప్పటి వరకకు 167 వన్డేలు ఆడిన ధావన్ 44.11 సగటుతో 6,793 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టాప్ స్కోర్ 143 పరుగులు. 68 టీ20 మ్యాచులు ఆడిన ధావన్ 27.93 సగటుతో 1759 పరుగులు చేశాడు. ఇందులో 11 అర్ధ సెంచరీలు కాగా, 92 అత్యధిక స్కోర్. ఇప్పటి వరకు ప్రాంచైజీ క్రికెట్ మ్యాచ్‌లను 122 ఆడిన ధావన్.. 44.26 సగటుతో 8,459 పరుగులు చేశాడు. ధావన్ ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ టీమ్‌కు కెప్టెన్‌గా ఆడుతున్నాడు.