సిడ్నీ టెస్టు తుది జట్టులో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న హిట్ మ్యాన్.. ఇక టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినట్లేనని అంతా భావిస్తున్నారు.
రోహిత్ శర్మ
సిడ్నీ, ఈవార్తలు : సిడ్నీ టెస్టు తుది జట్టులో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న హిట్ మ్యాన్.. ఇక టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినట్లేనని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ స్పందించాడు. ఐదో టెస్టు టాస్ సమయంలో స్టాండింగ్ కెప్టెన్ బుమ్రా మాట్లాడుతూ.. ఫామ్ కారణంగా రోహిత్ తనంతట తానే తప్పుకున్నాడని తెలిపాడు. అయితే, జట్టు మేనేజ్‌మెంట్ రోహిత్‌ను తప్పించిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తనంతట తానుగానే ఈ టెస్టు నుంచి తప్పుకున్నానని బ్రాడ్‌కాస్టర్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. జట్టు నుంచి తప్పించారన్న వార్తలపై స్పందించాలని కోరగా.. తనను జట్టు నుంచి తప్పించారన్న వార్తల్లో నిజం లేదని, టెస్టులో ఆడకపోవటం తన సొంత నిర్ణయమేనని స్పష్టం చేశాడు.
ప్రస్తుతం పరుగులు చేయటానికి ఇబ్బంది పడుతున్నానని, ఫామ్‌లో లేనని, జట్టుకు భారం కావొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించాడు రోహిత్ శర్మ. సిడ్నీ టెస్టు తమకు చాలా కీలకమని..అందుకే కోచ్, చీఫ్ సెలెక్టర్‌తో చర్చించి టెస్టుకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించాడు. ఒక మ్యాచ్‌కు దూరంగా ఉన్నంత మాత్రాన తాను రిటైర్మెంట్ ఇస్తున్నట్లు కాదని.. అయినా, తన మనసులో రిటైర్మెంట్ ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పాడు. త్వరలోనే కమ్‌బ్యాక్ ఇస్తానని, బయట కూర్చున్నవాళ్లు తన రిటైర్మెంట్‌ను డిసైడ్ చేయలేరని విమర్శకులకు చురక అంటించాడు.