భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరిగిన మూడో టి20లో భారత్ రికార్డ్ విజయాన్ని నమోదు చేసింది. టి20 సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్ హైదరాబాదులో జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 297 భారీ పరుగులను చేసింది. ఈ మ్యాచ్ లో భారత బాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఓపెనర్ సంజు శాంసన్ 47 బంతుల్లో 11 ఫోర్లు, నాలుగు సిక్సులు సహాయంతో 111 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ విఫలమైనప్పటికీ వన్ డౌన్ లో వచ్చిన సూర్య కుమార్ యాదవ్ కూడా రెచ్చిపోయాడు. 35 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్సులు సహాయంతో 75 పరుగులు చేశాడు.
విజయానందంలో టీమిండియా ఆటగాళ్ళు
భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరిగిన మూడో టి20లో భారత్ రికార్డ్ విజయాన్ని నమోదు చేసింది. టి20 సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్ హైదరాబాదులో జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 297 భారీ పరుగులను చేసింది. ఈ మ్యాచ్ లో భారత బాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఓపెనర్ సంజు శాంసన్ 47 బంతుల్లో 11 ఫోర్లు, నాలుగు సిక్సులు సహాయంతో 111 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ విఫలమైనప్పటికీ వన్ డౌన్ లో వచ్చిన సూర్య కుమార్ యాదవ్ కూడా రెచ్చిపోయాడు. 35 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్సులు సహాయంతో 75 పరుగులు చేశాడు. మరో బ్యాటర్ రియాన్ పరాగ్ కూడా బ్యాట్ ఝులిపించాడు. ఒక ఫోర్, నాలుగు సిక్సులు సహాయంతో 34 పరుగులు చేశాడు. ఆ తరువాత వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా ఆకాశమే హద్దుగా చల్లరేగిపోయాడు. 18 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సులు సహాయంతో 47 పరుగులు చేశాడు. దీంతో భారత జట్టు నిర్నేత 20 వార్లలో ఆరు వికెట్ల నష్టపోయి 297 పరుగులను చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ధాన్జీమ్ హసన్ సాకీబ్ మూడు, టాస్కిన్ అహ్మద్, ముస్తాఫిజర్, మహమ్మదుల్లా ఒక్కో వికెట్ తీశారు. భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 164 పరుగులు మాత్రమే చేసింది చేసింది. బంగ్లాదేశ్ బాటర్లలో లిటన్ దాస్ 25 బంతుల్లో ఎనిమిది ఫోర్లు సహాయంతో 42 పరుగులు చేయగా, తౌదీ హ్రీదయ్ 42 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సులు సహాయంతో 63 పరుగులు చేశాడు.
ఇద్దరు బ్యాటర్ల మినహా మిగిలిన వాళ్ళు ఎవరు పరుగులు చేయలేకపోవడంతో బంగ్లాదేశ్ జట్టు 164 పరుగులకు పరిమితమైంది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ మూడు, మయాంక్ యాదవ్ రెండు, వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి ఒక్కో వికెట్ పడగొట్టి బంగ్లాదేశ్ ను కట్టడి చేశారు. భారత జట్టు సాధించిన ఈ విజయం రికార్డుల్లోకి ఎక్కింది. తాజా మ్యాచ్లో భారత జట్టు 133 పరుగులు తేడాతో విజయం సాధించిగా, ఈ మ్యాచ్ కంటే మరో రెండు మ్యాచ్లు రికార్డు వస్తాయి పరుగులు తేడాతో విజయం సాధించి చరిత్రలో నిలిచాయి. 2023లో భారత జట్టు న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో 168 పరుగులు తేడాతో విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పటికే అదే అత్యధిక పరుగులు తేడాతో నమోదైన విజయంగా నిలిచింది. అంతకుముందు 2018 లో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు 143 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్ల్లో భారత జట్టు రికార్డు స్థాయి పరుగులు తేడాతో విజయాన్ని నమోదు చేసింది. టీ20 లో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్ జాబితాలో శనివారం జరిగిన మ్యాచ్ రెండో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో భారత్, బంగ్లాదేశ్ జట్లు 461 పరుగులు చేశాయి. భారత జట్టు 297 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ జట్టు 164 పరుగులు చేసింది. దీనికంటే ముందు ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ మధ్య 2019లో డెహ్రాడూన్ వేదిక జరిగిన మ్యాచ్లో 472 పరుగులు నమోదయ్యాయి. ఒకటి ఇటువంటి మ్యాచ్లో అత్యధికంగా నమోదైన పరుగులు జాబితాలో ఈ మ్యాచ్ లో నమోదైన పరుగులు ఇప్పటికీ రికార్డుగా కొనసాగుతోంది.