గ్రాండ్ విక్టరీ సాధించిన టీమిండియా.. తొలి టెస్ట్ లో ఘనవిజయం

ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు ఘన విజయం సాధించింది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియాను సొంత గడ్డపై మట్టి కరిపించి సరికొత్త చరిత్రను సృష్టించింది భారత జట్టు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన భారత జట్టు కంగారూలపై పూర్తి ఆధిపత్యాన్ని చలాయించింది.

Indian players in joy of victory

విజయం సాధించిన ఆనందంలో భారత ఆటగాళ్లు

ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు ఘన విజయం సాధించింది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియాను సొంత గడ్డపై మట్టి కరిపించి సరికొత్త చరిత్రను సృష్టించింది భారత జట్టు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన భారత జట్టు కంగారూలపై పూర్తి ఆధిపత్యాన్ని చలాయించింది. మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టిన భారత బౌలర్లు.. కంగారూలకు క్రీజులో నిలదొక్కుకునే అవకాశం ఇవ్వలేదు. ఏకంగా ఈ టెస్ట్ లో 295 పరుగులు తేడాతో భారత జట్టు విజయం సాధించింది. భారత జట్టుకు ఆస్ట్రేలియా గడ్డపై ఇదే అతి పెద్ద టెస్టు విజయం. ఇంతకుముందు 1977లో మెల్బోర్న్ లో జరిగిన టెస్ట్ లో టీమిండియా 222 పరుగులు తేడాతో విజయం సాధించింది. సరిగ్గా, 47 ఏళ్ల తర్వాత ఇప్పుడు టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించి విజయాన్ని నమోదు చేసింది.

భారత జట్టు విధించిన 534 పరుగుల లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఆస్ట్రేలియా జట్టు 238 పరుగులకు ఆల్ అవుట్ అయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 12/3 వద్ద నిలిచిన ఆస్ట్రేలియా జట్టు నాలుగో రోజున తీవ్ర ఒత్తిడి మధ్య ప్రారంభించింది. నాలుగో రోజు ఆరంభంలోనే మహమ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్ తో ఉస్మాన్ ఖవాజా (4), స్టీవ్ స్మిత్ (17) వికెట్లు తీసి ఆస్ట్రేలియా జట్టును మరింత డిఫెన్స్ లోకి నెట్టాడు. ఈ దశలో ట్రావిస్ హెడ్, మిచెల్ మార్స్ కాస్త పోరాటపటమను ప్రదర్శించారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు పరుగులు స్కోరుబోర్డుపై చేర్చారు. ఈ క్రమంలోనే ట్రావిస్ హెడ్ (89) వికెట్ పడగొట్టడంతో భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తరువాత నితీష్ రెడ్డి బౌలింగ్ లో మిచెల్ మార్స్ (47) అవుట్ కావడంతో భారత జట్టు పూర్తిగా మ్యాచ్ పై పట్టు బిగించింది. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో ఆస్ట్రేలియా జట్టు 238 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో టీమ్ ఇండియా జట్టు 295 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసి సరికొత్త చరిత్రను సృష్టించింది. రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా, సిరాజ్ మూడేసి వికెట్లు తీయగా, వాషింగ్టన్ సుందర్ రెండు, నితీష్ రెడ్డి, హర్షిత్ రానా చెరో వికెట్ పడగొట్టారు. 

ఈ టెస్ట్ లో భారత జట్టు తొలి ఏ న్యూస్ లో 150 పరుగులకే కుప్పకూలగా, ఆస్ట్రేలియా జట్టును భారత బౌలర్లు 104 పరుగులకే కట్టడి చేశారు. రెండో ఇన్నింగ్స్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. యశస్వి జైస్వాల్ 161, విరాట్ కోహ్లీ 100, కేఎల్ రాహుల్ 77 పరుగులతో రాణించడంతో భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్ల నష్టానికి 487 పరుగులకు డిక్లేర్ చేసింది. తొలి ఏన్నింగ్స్ లో ఆదిత్యను కలుపుకొని కంగారూలు ముందు టీమిండియా 534 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే భారీ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఆస్ట్రేలియా గట్టు తడబాటుకు గురికావడంతో 238 పరుగులకే గొప్ప కూలింది. దీంతో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో భారత జట్టు 295 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. 

ఈ టెస్ట్ లో విజయం సాధించడం ద్వారా భారత జట్టు చరిత్ర సృష్టించినట్టు అయింది. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా జట్టును అత్యధిక పరుగులు తేడాతో ఓడించిన జట్టుగా భారత్ నిలిచింది. అలాగే టీమ్ ఇండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. భారత్ తరపున జైస్వాల్ 15 టెస్ట్ మ్యాచ్లు ఆడి 1568 పరుగులు చేశాడు. తాజాగా జరిగిన టెస్టులు 297 బంతుల్లో 161 పరుగులు చేసి రాణించి రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు విజయ్ హజారే (1420) పేరిట ఉండేది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా బుమ్రా నిలిచాడు. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా జట్టు వెన్ను విరిచాడు. రెండో ఇన్నింగ్స్ లో మరోసారి మూడు వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ గా భారత జట్టును  ముందుండి నడిపించిన బుమ్రా అద్భుత విజయాన్ని అందించి పెట్టాడు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్