టి20 వరల్డ్ కప్ ప్రాథమిక దశ ముగిసింది. బుధవారం నుంచి సూపర్ - 8 దశ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వరల్డ్ కప్ లో పసి కూన జట్లు బలమైన జట్లకు షాక్ ఇచ్చాయి. దీంతో పలు కీలకమైన జట్లు ప్రాథమిక దశ నుంచే నిష్క్రమించాయి.
టి20 వరల్డ్ కప్
టి20 వరల్డ్ కప్ ప్రాథమిక దశ ముగిసింది. బుధవారం నుంచి సూపర్ - 8 దశ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వరల్డ్ కప్ లో పసి కూన జట్లు బలమైన జట్లకు షాక్ ఇచ్చాయి. దీంతో పలు కీలకమైన జట్లు ప్రాథమిక దశ నుంచే నిష్క్రమించాయి. న్యూజిలాండ్, పాకిస్తాన్ వంటి అగ్రశ్రేణి జట్టులో ఈసారి సూపర్-8 కు చేరుకోలేకపోయాయి. ఇకపోతే, బుధవారం నుంచి సూపర్ 8 మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19న దక్షిణాఫ్రికా, అమెరికా జట్ల మధ్య సూపర్ -8 లో తొలి మ్యాచ్ జరగనుంది. ఈనెల 20న వెస్టిండీస్ - ఇంగ్లాండ్, అదే రోజు రాత్రి 8 గంటలకు భారత్ - ఆఫ్గనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నెల 21న ఆస్ట్రేలియా - బంగ్లాదేశ్ జట్ల మధ్య ఉదయం 6 గంటలకు, రాత్రి 8 గంటలకు ఇంగ్లాండ్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈనెల 22న వెస్టిండీస్ అమెరికా జట్ల మధ్య ఉదయం 6 గంటలకు భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. ఈనెల 23న ఆస్ట్రేలియా - ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఉదయం 6 గంటలకు, సాయంత్రం 8 గంటలకు ఇంగ్లాండ్ - అమెరికా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈనెల 24న ఉదయం 6 గంటలకు వెస్టిండీస్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా, రాత్రి 8 గంటలకు భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ఈనెల 25న బంగ్లాదేశ్ ఆఫ్గనిస్తాన్ జట్ల మధ్య ఉదయం 6 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ తో సూపర్-8 దశ మ్యాచ్ లు ముగినున్నాయి.