Ind vs Ban : శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయఢంకా మోగింది. 50 పరుగుల తేడాతో బంగ్లాపై మరో విజయం నమోదు చేసింది.
బంగ్లాదేశ్‌పై టీమిండియా గెలుపు
న్యూయార్క్, ఈవార్తలు : టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ సేన దూసుకెళ్తోంది. వరుస మ్యాచ్‌లు గెలుచుకుంటూ సూపర్ -8లోకి అడుగుపెట్టిన టీమిండియా.. ఇక్కడ కూడా తనదైన దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయఢంకా మోగింది. 50 పరుగుల తేడాతో బంగ్లాపై మరో విజయం నమోదు చేసింది. మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లా.. భారత్‌ను బ్యాటింగ్‌కు దింపింది. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ మినహా మిగతా బ్యాటర్లు రాణించారు. హార్దిక్ పాండ్యా చివర్లో దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మ (23), విరాట్ కోహ్లీ (37), రిషబ్ పంత్ (36), శివం దుబే (34) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో తంజిమ్, రిషద్ చెరో రెండు వికెట్లు తీశారు.
చేజింగ్‌లో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోయారు. కెప్టెన్ నజ్ముల్ (40) మినహా ఎవరూ రాణించలేదు. కుల్దీప్ బంగ్లా బ్యాటర్ల వెన్నువిరిచాడు. మూడు కీలక వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించాడు. అర్ష్‌దీప్, పాండ్యా కూడా చెరో రెండు వికెట్లు తీశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ బ్యాటర్లు 8 వికెట్లు కోల్పోయి కేవలం 146 పరుగులే చేశారు. బౌలింగ్, బ్యాటింగ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శన కనబర్చిన హార్దిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ గెలుపుతో గ్రూప్-1లో టీమిండియా టాప్‌లోకి దూసుకెళ్లింది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచింది. ఈ నెల 20న ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌లో 47 పరుగుల తేడాలో విజయం సాధించగా, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో విజయాన్ని నమోదు చేసింది. దీంతో టేబుల్ టాప్‌గా నిలిచింది. సూపర్-8లో మరో మ్యాచ్ ఈ నెల 24న (సోమవారం) ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడనుంది.