న్యూయార్క్, ఈవార్తలు : ఆఫ్ఘనిస్థాన్ సంచలనం సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో కొత్త చరిత్ర లిఖించింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో స్టన్నింగ్ విక్టరీ సాధించి సగర్వంగా సెమీస్ చేరింది.
ఆఫ్ఘనిస్థాన్ సంచలనం
AFG vs BAN : న్యూయార్క్, ఈవార్తలు : ఆఫ్ఘనిస్థాన్ సంచలనం సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో కొత్త చరిత్ర లిఖించింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో స్టన్నింగ్ విక్టరీ సాధించి సగర్వంగా సెమీస్ చేరింది. దీంతో ఆస్ట్రేలియా ఇంటి దారి పట్టింది. ఆఫ్ఘనిస్థాన్ సహా భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్ చేరాయి. బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లకు ఆఫ్ఘనిస్థాన్ 5 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బంగ్లా బ్యాటర్లు 105 పరుగులకే ఆలౌట్ అయ్యి టోర్నీ నుంచి నిష్క్రమించారు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్ఘనిస్థాన్.. ఫస్ట్ వికెట్‌కు 59 పరుగులు జోడించింది. వికెట్ నెమ్మదించటంతో గుర్బాజ్ 55 బంతుల్లో 43 పరుగులే చేశాడు. ఇబ్రహీం జాద్రాన్ 29 బంతుల్లో 18 పరుగులే చేశాడు. అజ్మతుల్లా, గుల్బాదిన్, నబీ, కరీం జనాత్ రాణించలేకపోయారు. చివర్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రషీద్ ఖాన్.. పది బంతుల్లోనే 19 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సిక్సర్లు ఉండటం విశేషం. బంగ్లా బౌలర్లలో రిషద్ హుస్సేన్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ తనీజ్ హాసన్ డకౌట్ అయ్యాడు. ఓ ఎండ్‌లో లిట్టన్ దాస్ ఒంటరి పోరాటం చేశాడు. అతడు 49 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అతవలి ఎండ్‌లో ఏ ఒక్క బ్యాటర్ కూడా కుదురుగా నిలవలేకపోయారు. రషీద్ ఖాన్ సంచలన స్పెల్‌తో బంగ్లా బ్యాటర్ల భరతం పట్టాడు. నాలుగు ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి కీలక నాలుగు వికెట్లు తీశాడు. మరో బౌలర్ నవీన్ ఉల్ హక్ కూడా నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. చివర్లో రెండు వికెట్లు తీసి ఆఫ్ఘనిస్థాన్‌ను విజయతీరాలకు చేర్చాడు. నూర్ అహ్మద్ వికెట్లేమీ తీయకపోయినా 4 ఓవర్లకు కేవలం 13 పరుగులే ఇచ్చి బంగ్లా స్కోరును అడ్డుకున్నాడు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌లో అడుగుపెట్టింది. సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అటు.. టీమిండియా ఇంగ్లండ్‌ను ఢీకొట్టబోతోంది. రేపు (బుధవారం) తొలి సెమీఫైనల్ జరగనుండగా, ఎల్లుండి (జూన్ 27న) సెమీ ఫైనల్ 2 జరగ నుంది. సెమీఫైనల్ 1లో ఆఫ్ఘనిస్థాన్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. సెమీఫైనల్2లో ఇండియా, ఇంగ్లండ్ ఢీకొట్టనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లలో విజేతలో జూన్ 29వ తేదీన ఫైనల్‌లో ట్రోఫీ కోసం బరిలోకి దిగుతాయి. ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియా ఇంటి దారి పట్టింది. ఆఫ్ఘనిస్థాన్, భారత్ చేతిలో ఓడిపోయిన మార్ష్ బృందం టోర్నీ నుంచి నిష్క్రమించింది.