SRH vs RR Qualifier 2 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్ లో హైదరాబాద్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్ కు చేరింది. సెమీ ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణించిన హైదరాబాద్ జట్టు విజయాన్ని సాధించడం ద్వారా ఫైనల్లో అడుగుపెట్టింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్ లో హైదరాబాద్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్ కు చేరింది. సెమీ ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణించిన హైదరాబాద్ జట్టు విజయాన్ని సాధించడం ద్వారా ఫైనల్లో అడుగుపెట్టింది. చెన్నైలోని చపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆ జట్టు ఆటగాళ్లు క్లాసెన్ (34 బంతుల్లో నాలుగు సిక్సులతో 50 పరుగులు), త్రిపాఠి (15 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సులతో 37), హెడ్ (28 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ తో 34 పరుగులు) రాణించడంతో 175 పరుగులు చేయగలిగింది. రాజస్థాన్ జట్టు బౌలర్లలో అవేష్, బౌల్ట్ మూడేసి, సందీప్ రెండు వికెట్లు పడగొట్టారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 139 పరుగులకు మాత్రమే పరిమితమైంది. దీంతో 36 పరుగులు తేడాతో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది.
రాజస్థాన్ చెట్లు జూరెల్ 35 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్స్లతో 56 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి తుది వరకు పోరాడాడు. జైస్వాల్ 21 బంతుల్లో నాలుగు ఫ్లోర్లు, మూడు సిక్సులతో 42 పరుగులు చేసి సహకారాన్ని అందించాడు. జట్టులోని మిగిలిన ఆటగాళ్లు ఎవరో రాణించలేకపోవడంతో రాజస్థాన్ జట్టు ఘోర పరాభావాన్ని మూట గట్టుకోవాల్సి వచ్చింది. నటరాజన్, కమిన్స్ కు ఒక్కో వికెట్ దక్కింది. బౌలింగ్ అనుకూలించిన పిచ్ పై హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా రానించి రాజస్థాన్ బ్యాటర్లను కట్టడి చేశారు. సెమీఫైనల్ లో విజయంతో హైదరాబాద్ జట్టు ఫైనల్ కు చేరింది. ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో హైదరాబాద్ జట్టు ఫైనల్ లో తలపడనుంది. ఇప్పటి వరకు మూడోసారి హైదరాబాద్ జట్టు ఫైనల్ కు చేరినట్టు అయింది.