తుది పోరులో దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్.. నేడు అండర్-19 మహిళ టి20 వరల్డ్ కప్ ఫైనల్

యువ మహిళల భారత జట్టు అద్భుత విజయాలతో దూసుకుపోతోంది. మరొక్క అడుగు దూరంలో అండర్ 19 ఇటువంటి వరల్డ్ కప్ కు నిలిచింది. ఈ వరల్డ్ కప్ లో ఒక్క ఓటమి లేకుండా అప్రతిహత విజయాలతో ఫైనల్ వరకు దూసుకొచ్చిన భారత్.. ఆదివారం దక్షిణాఫ్రికాతో తుది పోరులో తలపడనుంది. ఈ ఫైనల్ మ్యాచ్లో విజయం సాధిస్తే వరుసగా రెండోసారి అండర్ 19 టి20 వరల్డ్ కప్ విజేతగా భారత జట్టు నిలువనుంది. నిక్కీ ప్రసాద్ సారధ్యంలోని యువ భారత జట్టు అమ్మాయిలు అద్భుతమైన ఆట తీరుతో ఈ టోర్నీలో అదరగొడుతున్నారు. కౌలాలంపూర్ వేదికగా మధ్యాహ్నం 12 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Indian and South African team players

భారత, దక్షిణాఫ్రికా జట్టు ఆటగాళ్లు

యువ మహిళల భారత జట్టు అద్భుత విజయాలతో దూసుకుపోతోంది. మరొక్క అడుగు దూరంలో అండర్ 19 ఇటువంటి వరల్డ్ కప్ కు నిలిచింది. ఈ వరల్డ్ కప్ లో ఒక్క ఓటమి లేకుండా అప్రతిహత విజయాలతో ఫైనల్ వరకు దూసుకొచ్చిన భారత్.. ఆదివారం దక్షిణాఫ్రికాతో తుది పోరులో తలపడనుంది. ఈ ఫైనల్ మ్యాచ్లో విజయం సాధిస్తే వరుసగా రెండోసారి అండర్ 19 టి20 వరల్డ్ కప్ విజేతగా భారత జట్టు నిలువనుంది. నిక్కీ ప్రసాద్ సారధ్యంలోని యువ భారత జట్టు అమ్మాయిలు అద్భుతమైన ఆట తీరుతో ఈ టోర్నీలో అదరగొడుతున్నారు. కౌలాలంపూర్ వేదికగా మధ్యాహ్నం 12 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్లో అన్ని విభాగాల్లో భారత జట్టు దుమ్ము రేపి విజయాలను నమోదు చేసింది. వెస్టిండీస్ జట్టుపై తొమ్మిది వికెట్ల తేడాతో, మలేషియాపై 10 వికెట్ల తేడాతో, శ్రీలంకపై 60 పరుగులు తేడాతో, బంగ్లాదేశ్ పై 8 వికెట్లు తేడాతో, స్కాట్లాండ్ పై 150 పరుగులు తేడాతో, సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ జట్టుపై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి భారత జట్టు అమ్మాయిలు ఫైనల్ కు చేరారు. తెలుగు అమ్మాయి గొంగడి త్రిష బ్యాటింగ్ లో అద్భుత ప్రదర్శనతో అదరగొడుతోంది. ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్ లో 66.25 సగటు 25 పరుగులు చేసింది.

తద్వారా టోర్నీలో టాప్ స్కోరర్ గా త్రిష నిలిచింది. త్రిష ఓపెనింగ్ భాగస్వామి పేపర్ కమిలిని ఆరు ఇంజెన్సీల్లో 45 సగటుతో 135 పరుగులు చేసింది. టోర్నీలో ఓవరాల్ గా అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటరుగా కొనసాగుతోంది. ఫైనల్ మ్యాచ్ లోను వీరిద్దరూ రాణిస్తే భారత జట్టు టైటిల్ దక్కించుకోవడం సులభమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీరిద్దరూ రాణింపుపైనే భారత జట్టు ఆశలు పెట్టుకుంది. బౌలింగ్ విభాగంలో భారత జట్టు అద్భుతంగా రాణిస్తుంది. మరి ముఖ్యంగా స్పిన్ ద్వయం వైష్ణవి, ఆయుషి ప్రత్యర్ధులకు సింహ స్వప్నంగా మారుతున్నారు. వైష్ణవి 15, ఆయుషి 12 వికెట్లతో టోర్నీలో టాప్ టు బౌలర్లుగా నిలిచారు. టైటిల్ ఫైట్ లోనూ వీరిద్దరూ కీలకము కానున్నారు. మరోవైపు దక్షిణాఫ్రికా కూడా ఒక్క పరాజయం లేకుండా ఫైనల్ లో అడుగు పెట్టింది. ఇదే జ్వరనో ఫైనల్ లో కొనసాగించాలని ఆ జట్టు కోరుకుంటుంది. ఇరు జట్లు మెరుగ్గా రాణించగలిగితే మాత్రం ఫైనల్ పోరు నువ్వా నేనా అన్నట్టుగా సాగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మరి దక్షిణాఫ్రికా జట్టు తొలిసారి టైటిల్ కైవసం చేసుకుంటుందా.? భారత జట్టు రెండోసారి విశ్వ విజేతగా నిలుస్తుందా అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్