భారత మహిళా రెజ్లర్ అథ్లెట్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకుంది.అనూహ్య రీతిలో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ నుండి అనర్హులుగా ప్రకటించిన తర్వాత తాను రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది.ఈ విషయాన్ని ఫొగాట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
vinesh
పారిస్ ఒలింపిక్స్ 2024లో స్వర్ణ పతకానికి ముందు ఆగస్టు 7న భారత మహిళా రెజ్లర్ అథ్లెట్ వినేష్ ఫోగట్ అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఆమె మెడల్ మ్యాచ్‌కు ముందు వినేష్ బరువు నిర్దేశించిన పరిమితి కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉంది. ఆ తర్వాత మ్యాచ్ అధికారులు ఆమెను అనర్హులుగా ప్రకటించారు. వినేష్ పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ నిర్ణయం అస్వస్థతకు గురైన వినేష్ కూడా ఆసుపత్రిలో చేరారు. ఇప్పుడు హఠాత్తుగా ఓ పెద్ద నిర్ణయం తీసుకుని రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులందరినీ షాకింగ్ గు గురిచేసింది.
माँ कुश्ती मेरे से जीत गई मैं हार गई माफ़ करना आपका सपना मेरी हिम्मत सब टूट चुके इससे ज़्यादा ताक़त नहीं रही अब।अलविदा कुश्ती 2001-2024 ?आप सबकी हमेशा ऋणी रहूँगी माफी ??
— Vinesh Phogat (@Phogat_Vinesh) August 7, 2024