టీమిండియాకు షాక్.. ఆఫ్ఘనిస్తాన్ పై ఓడిన భారత్ క్రికెట్ జట్టు

కీలకమైన సెమీఫైనల్ లో భారత ఏ జట్టు ఓటమిపాలై అభిమానుల ఆశలను అడియాసలు చేసింది. ఎమర్జింగ్ ఆసియా కప్ - 2024 టోర్నీ కొద్ది రోజుల నుంచి జరుగుతున్నాయి. ఈ టోర్నీలోని లీగ్ దశలోని అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించి సెమీస్ కు వెళ్లిన భారత ఏ జట్టు.. చిన్న జట్టు అయిన ఆఫ్గనిస్తాన్ ఏ పై ఓటమిపాలైంది. అక్టోబర్ 27న ఆఫ్ఘనిస్తాన్ ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సెమీ ఫైనల్ మ్యాచ్ లో తొలిత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 206 భారీ పరుగులు చేసింది.

Afghanistan team celebrating after the victor

విజయానంతరం సంబరాల్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు

టీమిండియాకు ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్ జట్టు షాక్ ఇచ్చింది. కీలకమైన సెమీఫైనల్ లో భారత  ఏ జట్టు ఓటమిపాలై అభిమానుల ఆశలను అడియాసలు చేసింది. ఎమర్జింగ్ ఆసియా కప్ - 2024 టోర్నీ కొద్ది రోజుల నుంచి జరుగుతున్నాయి. ఈ టోర్నీలోని లీగ్ దశలోని అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించి సెమీస్ కు వెళ్లిన భారత ఏ జట్టు.. చిన్న జట్టు అయిన ఆఫ్గనిస్తాన్  పై ఓటమిపాలైంది. అక్టోబర్ 27న ఆఫ్ఘనిస్తాన్  , శ్రీలంక  ఏ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 

సెమీ ఫైనల్ మ్యాచ్ లో తొలిత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టు  నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 206 భారీ పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో జుబైద్ అక్బరి 41 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 64 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సిదిక్యుల్లా అటల్ 52 బంతుల్లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 83 పరుగులు చేశాడు. వీరిద్దరూ 14.1 ఓవర్లలో తొలి వికెట్ కు 137 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఓపెనర్లు ఇద్దరు అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో భారీ స్కోరుకు బాటలు వేశారు. ఆ తర్వాత వచ్చిన కరీమ్ జనాత్ 20 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సులతో 41 పరుగులు చేశాడు. దీంతో నిర్ణయిత 20 ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 206 పరుగులను నాలుగు వికెట్లను నష్టపోయి చేసింది. భారత బౌలర్లలో రాహుల్, రసిక్ శాలం ఒక్కో వికెట్ పడగొట్టారు. బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు తొల నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడడంతో పాటు వెంట వెంటనే వికెట్లు కోల్పోయారు. దీంతో ఏ దశలోనూ భారత జట్టు లక్ష్యం దశగా ముందుకు సాగినట్లు కనిపించలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులకు పరిమితమైంది భారత జట్టు. దీంతో 20 పరుగులు తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు సెమీఫైనల్ లో విజయం సాధించింది. భారత బాటర్లలో ప్రభు సిమ్రాన్ సింగ్ (19), అభిషేక్ శర్మ 7 (5), కెప్టెన్ తిలక్ వర్మ 16(14) పెద్దగా రాణించలేకపోయారు. వీరు ముగ్గురు వెంట వెంటనే అవుట్ కావడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన ఆయుష్ బదోని 31(24), నేహాల్ వదెరా  20(14), రమన్ దీప్ సింగ్ 64(34), నిశాంత్ సింధు 23(13) బ్యాట్లు ఝులిపించడంతో భారత జట్టు ఆమాత్రమైన స్కోర్ చేయగలిగింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో అల్లా గజాన్ఫర్, అబ్దుల్ రహమాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. తాజా విజయంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. చిన్న జట్టుపై భారత్ ఓడిపోవడంతో అభిమానులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్