ఒలింపిక్స్ లో భారత్ కు షాక్.. వినేష్ ఫోగాట్ పై అనర్హత వేటు

పారిస్ ఒలంపిక్స్ లో భారత్ కు షాక్ తగిలింది. రెజ్లింగ్ లో భారత్ కు పతకం ఖాయం అనుకున్న దశలో వినేష్ పోగాట్ పై అనర్హత వేటు వేయడంతో పతక ఆశలు అడియాశలుగా మారాయి. ప్రపంచ ఛాంపియన్ ను ఓడించిన కొద్ది గంటల్లోనే ఈ వార్త రావడం ప్రస్తుతం దేశంలోని అభిమానులను శోక సంద్రంలో ముంచింది. అధిక బరువు కారణంగా వినేష్ ఫోగాట్ పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి.

Vinesh Pogat

 వినేష్ పోగాట్

పారిస్ ఒలంపిక్స్ లో భారత్ కు షాక్ తగిలింది. రెజ్లింగ్ లో భారత్ కు పతకం ఖాయం అనుకున్న దశలో  వినేష్ పోగాట్ పై అనర్హత వేటు వేయడంతో పతక ఆశలు అడియాశలుగా మారాయి. ప్రపంచ ఛాంపియన్ ను ఓడించిన కొద్ది గంటల్లోనే ఈ వార్త రావడం ప్రస్తుతం దేశంలోని అభిమానులను శోక సంద్రంలో ముంచింది. అధిక బరువు కారణంగా వినేష్ ఫోగాట్ పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. వినేష్ ఫోగాట్ అనర్హత వేటు గురించి భారత ఒలంపిక్ సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వినేష్ ఫోగాట్ పై వేటు పడినట్టుగా తెలిపింది. అయితే, ఈ విషయంలో వినేష్ ఫోగాట్ ప్రైవసీకి భంగం కలుగకుండా ప్రవర్తించాలని తాము విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొంది. అసలు అనర్హత వేటు వార్తలను పంచుకోవడం తమకు అత్యంత బాధను కలిగిస్తోందని భారత ఒలంపిక్ సంఘం వెల్లడించింది. 

వినేష్ ఫోగాట్ అనర్హతపై అనేక అనుమానాలు..

వినేష్ ఫోగాట్ విషయంలో అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై సవాల్ చేసేందుకు ఐఓఏ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అసోసియేషన్ నిబంధనలు ప్రకారం ఏదైనా పోటీ జరిగే రోజున కొన్ని గంటల ముందు బరువుతోపాటు వైద్య పరీక్షలను కచ్చితంగా నిర్వహిస్తారు. అయితే మంగళవారం రాత్రి సెమీస్ లో తలపడిన వినేష్ ఫోగాట్ కొన్ని గంటల తరువాత బుధవారం ఉదయానికే బరువు పెరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒలంపిక్ కమిటీ ఈ విషయంపై పునః  సమీక్ష చేయటానికి నిరాకరిస్తే మాత్రం వినేష్ ఫోగాట్ పై అనర్హత వేటు కొనసాగుతుంది. వినేష్ ఫోగాట్ అనర్హతపై మాత్రం అభిమానులతోపాటు దేశమంతా ఆవేదనను వ్యక్తం చేస్తోంది. ఇదిలా, ఉంటే వినేష్ ఫోగాట్ హేమ హేమీలను ఓడించి ఈ స్థాయికి వచ్చింది. డిపెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ జపాన్ కి చెందిన యుయి సుసాకిని ఓడించి క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది. అక్కడ యూరోపియన్ ఛాంపియన్, ఉక్రేయిన్ కు చెందిన వక్షాన లివాచ్ పై విజయం గెలిచింది. సెమీ ఫైనల్స్ లో క్యూబాకు చెందిన పాన్ అమెరికన్ గేమ్స్ ఛాంపియన్ యస్నీలిస్ గుజ్మాన్ పై విజయాలు నమోదు చేసింది. ఈ గెలుపుతో ఒలంపిక్స్ లో రెజ్లింగ్ ఫైనల్ కు చేరిన తొలి భారతీయ మహిళగా వినేష్ ఫోగాట్ రికార్డు సృష్టించింది. పతకం ఖాయం అనుకున్న దశలో అనర్హత వేటుపడడంతో సర్వత్ర ఆవేదన వ్యక్తమవుతోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్