టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్ అరుదైన రికార్డ్స్ సాధించాడు. సౌతాఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఐదో టీ20లో అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్.. అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.
సంజూ శాంసన్
టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్ అరుదైన రికార్డ్స్ సాధించాడు. సౌతాఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఐదో టీ20లో అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్.. అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గాయంతో జట్టుకు దూరమవడంతో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ శాంసన్.. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37 పరుగులు చేసి ఓపెనింగ్ స్థానానికి తానే సరైనోడినని చాటి చెప్పాడు. ఈ మ్యాచ్ రెండో ఓవర్‌లో పికప్ షాట్‌తో లాంగాన్ దిశగా భారీ సిక్స్ బాదిన సంజూ శాంసన్.. రెండు అరుదైన రికార్డ్‌లను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ సిక్స్‌తో అంతర్జాతీయ టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న సంజూ శాంసన్.. కేరళ తరఫున టీ20ల్లో 8000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సంజూ కొట్టిన షాట్‌కు ఫిదా అయిన కామెంటేటర్.. 'సంజు శాంసన్ చాలా అద్భుతమైన ఆటగాడు. అతను చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. కానీ అతను ఆ షాట్ ఆడిన తీరు ఆశ్చర్యకరంగా ఉంది. మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా సడెన్‌గా మైదానంలోకి దిగి ఆడినట్లుగా లేదు. బంతిని అతను టైమింగ్ చేసిన విధానం అంత సులువు కాదు.'అని కొనియాడాడు.