దక్షిణాఫ్రికా పర్యటనను భారత జట్టు ఘనంగా ఆరంభించింది. డర్బన్ లో జరిగిన తొలి టి20 భారత జట్టు 61 పరుగులు తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. భారత జట్టు ఆటగాళ్లలో సంజు శాంసన్ ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
గెలుపు ఆనందంలో భారత జట్టు ఆటగాళ్లు
దక్షిణాఫ్రికా పర్యటనను భారత జట్టు ఘనంగా ఆరంభించింది. డర్బన్ లో జరిగిన తొలి టి20 భారత జట్టు 61 పరుగులు తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. భారత జట్టు ఆటగాళ్లలో సంజు శాంసన్ ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 50 బంతుల్లో 7 ఫోర్లు, పది సిక్సర్ల సహాయంతో 107 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించడంలో కీలకంగా మారాడు. బంగ్లాదేశ్ తో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లోనూ సెంచరీ తో అదరగొట్టిన శాంసన్.. తాజా మ్యాచ్ లోను సెంచరీ చేయడం ద్వారా వరుసగా రెండు సెంచరీలు చేసిన రికార్డును నమోదు చేశాడు. భారత ఆటగాళ్లలో తిలక్ వర్మ 18 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సులు సహాయంతో 33 పరుగులు చేయగా, సూర్య కుమార్ యాదవ్ 17 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 21 పరుగులు చేసి రాణించారు. మిగిలిన ఆటగాళ్లు పెద్దగా స్కోర్ చేయలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కొట్జీకు మూడు వికెట్లు దక్కాయి.
ఆ తరువాత చేదనలో దక్షిణాఫ్రికా జట్టు 17.5 ఓవర్లలో 141 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా శాంసన్ నిలిచాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు ఏ దశలోను విజయం వైపు పైనుంచి లేదు. తొలి ఓవర్ లోనే దూకుడుగా ఆడిన కెప్టెన్ మార్క్రమ్ (8) వెనుదిరిగాడు. అద్భుతమైన బంతితో అర్షదీప్ సింగ్ దక్షిణాఫ్రికా కెప్టెన్ ను బోల్తా కొట్టించాడు. భారత స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి భీష్నోయ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయలేక దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. మరో ఓపెనర్ రికెల్టన్, స్టబ్స్ (11) కూడా పవర్ ప్లే లోనే అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన క్లాసేన్, డేవిడ్ మిల్లర్ జట్టును ముందుకు నడిపే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే రన్ రేట్ భారీగా పెరిగిపోవడం, పరుగులు రాకపోవడంతో ఈ ఇద్దరు బ్యాటర్లు కూడా ఇబ్బంది పడ్డారు. ఇద్దరినీ 12వ ఓవర్ లో వరుణ్ చక్రవర్తి పెవిలియన్ కు చేర్చడం ద్వారా భారత జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు వచ్చినట్టే వెళ్లిపోవడంతో దక్షిణాఫ్రికా జట్టు 141 పరుగులకు ఆల్ అవుట్ అయింది. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ మూడేసి వికెట్లు పడగొట్టారు.