భార్య అంజలిని ఫ్లర్ట్ చేస్తున్న సచిన్ టెండుల్కర్

సచిన్ కూడా.. తన భార్య అంజలిని ఫ్లర్ట్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన భార్యతో దిగిన ఒక ఫొటోను పంచుకొని.. ఒక అద్భుతమైన క్యాప్షన్ జతచేశాడు.

sachin anjali

సచిన్ అంజలి

సచిన్ టెండుల్కర్ బ్యాట్ పట్టాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. సచిన్ షాట్లకు ఎంతో మంది బౌలర్లు నిద్రలేని రాత్రులు గడిపారు. అప్పర్ కట్ షాట్‌తో బౌన్సర్లను సైతం బౌండరీ దాటించిన ఘనుడు ఈ లిటిల్ మాస్టర్. క్రికెట్ చరిత్రలో ఎవరూ సాధించలేని ఎన్నో రికార్డులు సాధించాడీ మాస్టర్ బ్లాస్టర్. అలాంటి సచిన్ కూడా.. తన భార్య అంజలిని ఫ్లర్ట్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన భార్యతో దిగిన ఒక ఫొటోను పంచుకొని.. ఒక అద్భుతమైన క్యాప్షన్ జతచేశాడు. ఫొటోలో వెనక ఎర్రని పువ్వులు ఉండగా.. అంజలివైపు వేలిని చూపిస్తూ అని పువ్వుల్లో వెలిగిపోతున్న పువ్వు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఫొటోలో భార్యాభర్తలిద్దరూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. దీంతో ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. మనోడిలో ఇలాంటి కోణాలు కూడా ఉన్నాయా.. అంటూ కొందరు,  అంజలిని ఏనాడో పడేసిన సచిన్.. ఆమెను మళ్లీ మళ్లీ పడేసేందుకు చిలిపి చేష్టలు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కాగా, సచిన్, అంజలిది ప్రేమ వివాహమే. సచిన్ కన్నా అంజలి ఆరేళ్లు పెద్ద. 1995లో వివాహం చేసుకున్నారు. వీరికి సారా, అర్జున్ ఇద్దరు పిల్లలు. అంజలి పిల్లల డాక్టర్. ప్రస్తుతం సారా ఫ్యాషన్ డిజైనింగ్‌లో బిజీగా ఉండగా, అర్జున్ టెండుల్కర్ భారత క్రికెట్‌ జట్టులో చోటు దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. పెళ్లి చేసుకునే నాటికి భారత క్రికెట్‌లో సచిన్ గొప్పగా ఎదుగుతున్నాడు. ఎంతో మంది యువతులు సచిన్ ఆట కోసమే గ్రౌండ్‌కు వెళ్లేవారు. టీవీలకు అతుక్కుపోయేవారు. అలాంటిది.. అంజలిని ప్రేమ వివాహం చేసుకోవటంతో వాళ్ల గుండె గుభేల్‌మంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్