IND vs SA T20 | నాలుగో టీ20 మ్యాచ్.. టీమిండియా రికార్డుల మోత

దక్షిణాఫ్రికా గడ్డపై అద్భుత ప్రదర్శనతో టీ20 ఫార్మాట్‌ను ఈ ఏడాది ఘనంగా ముగించింది. శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో సూర్యకుమార్ సేన అద్భుత విజయాన్ని సాధించింది.

samson tilak varma

సంజు శాంసన్, తిలక్ వర్మ

న్యూజిలాండ్ చేతిలో సొంత గడ్డపై టెస్ట్ సిరీస్ ఓడిపోవడంతో బాధతో ఉన్న ఫ్యాన్స్‌కు టీ20 మజాను అందించింది టీమిండియా జట్టు. దక్షిణాఫ్రికా గడ్డపై అద్భుత ప్రదర్శనతో టీ20 ఫార్మాట్‌ను ఈ ఏడాది ఘనంగా ముగించింది. శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో సూర్యకుమార్ సేన అద్భుత విజయాన్ని సాధించింది. 284 పరుగులు చేసి.. 135 పరుగుల తేడాతో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఫలితంగా సిరీస్ 3-1 తేడాతో భారత్ వశమైంది. అర్ష్‌దీప్ సింగ్ అద్భుత బౌలింగ్‌తో సఫారీల వెన్ను విరిచాడు. అంతకుముందు టీమిండియా బ్యాటింగ్ చేపట్టింది. ఆకాశమే హద్దుగా హైదరాబాదీ తిలక్‌ వర్మ (47 బంతుల్లో 120 నాటౌట్‌, 9 ఫోర్లు, 10 సిక్స్‌లు), సంజుశాంసన్‌ (56 బంతుల్లో 109 నాటౌట్‌, 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) సెంచరీలు చేయడంతో  సెంచరీలతో భారత్‌ 20 ఓవర్లలో 283/1 స్కోరు చేసింది. వీరిద్దరు సఫారీ బౌలర్లను ఊచకోత కోశారు.

అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. తిలక్‌ వర్మ వరుస మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు చేస్తే, సంజు శాంసన్‌ తొలి, ఆఖరి మ్యాచ్‌లో సెంచరీలు చేశారు. తిలక్‌ వర్మకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ దక్కాయి. తిలక్ వర్మ, శాంసన్‌తో పాటు ఓపెనర్ అభిషేక్ శర్మ (36) దూకుడుగా ఆడి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. భారీ లక్ష్యం కళ్ల ముందు ఉండటంతో లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా తడబడింది. అర్ష్‌దీప్‌సింగ్‌..సఫారీల టాపార్డర్‌ భరతం పట్టాడు. అర్ష్‌దీప్‌ ధాటికి హెండ్రిక్స్‌ (0), మార్క్మ్‌(8), క్లాసెన్‌(0) సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయ్యారు.మిడిలార్డర్‌లో స్టబ్స్‌ (43), మిల్లర్‌ (36) ప్రయత్నించారు. ఆఖర్లో జాన్సెన్‌ (29*) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది.

టీమిండియా రికార్డుల మోత

మెన్స్ టీ20ల్లో 3 సార్లు 250+ స్కోర్ చేసిన తొలి జట్టు టీమిండియా

ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో టీ20ల్లో 3 సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా శాంసన్‌ నిలిచాడు.

టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి (పూర్తి స్థాయి సభ్యదేశాలు). ఓవరాల్‌గా ది మూడోసారి.

ఒక సిరీస్‌లో 4 సెంచరీలు నమోదవడం ఇదే తొలిసారి

టీ20ల్లో ఏ వికెట్‌కైనా భారత్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం(210*)

విదేశాల్లో టీ20ల్లో టీమిండియాకు ఇదే అత్యుత్తమ స్కోరు(283/1)

టీ20ల్లో వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసిన రెండో భారత బ్యాటర్‌గా తిలక్‌వర్మ నిలిచాడు. ఇంతకుముందు శాంసన్‌ పేరిట ఈ రికార్డు ఉంది.

టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యధిక సిక్స్‌లు 23


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్