టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచ క్రికెట్లో విధ్వంస ఆటకు మారుపేరుగా నిలిచిన రోహిత్ శర్మ ఇప్పటికే అనేక రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టును ఆస్ట్రేలియా పై విజయం సాధించడం ద్వారా ఫైనల్ కు చేర్చిన రోహిత్ శర్మ ఈ క్రమంలో మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. అన్ని ఐసీసీ ఈవెంట్స్ లో భారత జట్టును ఫైనల్ కు చేర్చిన తొలి కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాపై విజయం సాధించడం ద్వారా ఫైనల్ కు భారత జట్టు చేరిన విషయం తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ కు చేరడంతో పాటు గతంలోనూ పలు ట్రోపీల్లో భారత జట్టును రోహిత్ శర్మ సారధ్యంలో ఫైనల్ కు చేరింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచ క్రికెట్లో విధ్వంస ఆటకు మారుపేరుగా నిలిచిన రోహిత్ శర్మ ఇప్పటికే అనేక రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టును ఆస్ట్రేలియా పై విజయం సాధించడం ద్వారా ఫైనల్ కు చేర్చిన రోహిత్ శర్మ ఈ క్రమంలో మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. అన్ని ఐసీసీ ఈవెంట్స్ లో భారత జట్టును ఫైనల్ కు చేర్చిన తొలి కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాపై విజయం సాధించడం ద్వారా ఫైనల్ కు భారత జట్టు చేరిన విషయం తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ కు చేరడంతో పాటు గతంలోనూ పలు ట్రోపీల్లో భారత జట్టును రోహిత్ శర్మ సారధ్యంలో ఫైనల్ కు చేరింది. ఈ ఘనత సాధించిన తొలి భారత కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. 2023లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టీమిండియాను ఫైనల్ చేరింది. ఆ తర్వాత 2023లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు చేరింది. అలాగే 2024లో జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరిన భారత జట్టు ట్రోఫీ కూడా సాధించింది. తాజాగా ఛాంపియన్స్ లీగ్ లో ఫైనల్ కు చేరడం ద్వారా ఐసీసీ నిర్వహించిన అన్ని ట్రోఫీలోనూ రోహిత్ శర్మ సారధ్యంలో ఫైనల్ కు చేరిన జట్టుగా నిలిచింది. దీంతో అన్ని ఐసీసీ ట్రోఫీలోనూ ఫైనల్ కు చేర్చిన తొలి కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్పును రోహిత్ శర్మ సారధ్యంలో భారత జట్టు గెలుపొందింది. తాజాగా ఛాంపియన్స్ లీగ్ లోను అద్భుత ప్రదర్శనతో భారత జట్టు అదరగొడుతోంది. సెమీఫైనల్ లో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును భారత్ ఓడించి కసి తీర్చుకుంది. బుధవారం దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో సమీపైన జరగనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టుతో భారత జట్టు ఫైనల్ ఆడుతుంది.
తొలి ప్లేయర్ గా రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ..
చాంపియన్స్ లీగ్ లో దూకుడు అయిన ఆటతీరుతో అదరగొడుతున్న రోహిత్ శర్మ మరో రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఐసీసీ వన్డే ఈవెంట్స్ లో అత్యధిక సిక్సులు కొట్టిన క్రికెటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో కలిపి ఇప్పటివరకు రోహిత్ శర్మ 65 సిక్సులు కొట్టాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు 42 ఇన్నింగ్స్ లు ఆడి ఈ ఘనతను సాధించాడు. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ మాజీ లెజెండ్ క్రిష్ గెలు పేరిట ఉండేది. అతడు 51 ఇన్నింగ్స్ లో మొత్తం 64 శిక్సర్లు కొట్టాడు. రోహిత్ శర్మ అతి తక్కువ ఇన్నింగ్స్ లోనే ఈ ఘనతను సాధించి తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్నాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ 272 వన్డే మ్యాచ్లు ఆడి 341 సిక్సర్లను కొట్టాడు. అత్యంత వేగంగా 350 వన్డే సిక్సర్లు కొట్టిన తొలి బాటరుగా నిలిచేందుకు రోహిత్ శర్మ 9 సిక్సులు దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ బ్యాటర్ షాహిద్ అఫ్రిది (351) పేరిట ఉంది. అతడు 398 మ్యాచ్లో ఈ ఘనతను సాధించాడు.