Team India | BCCI Prize Moneyలో ఎవరికి ఎంతెంత అంటే..

జూలై 4వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన వేడుకల సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.125 కోట్ల విలువైన చెక్‌ను కూడా అందజేసింది. అయితే, ఇందులో ఎవరికి ఎంత దక్కనుంది? అన్న సందేహం చాలా మందిలో తలెత్తింది.

team india

టీమిండియా Photo: Instagram

న్యూఢిల్లీ : 11 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా T20 World Cupని గెలిచింది. జూన్ 29న బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరిగిన పొట్టి ప్రపంచకప్ ఫైనల్‌లో సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, విశ్వవిజేతగా నిలిచింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా T20 World Cup గెలవటంతో బీసీసీఐ టీమిండియాకు భారీ నజరానా ప్రకటించింది. టీమిండియా బృందానికి మొత్తంగా రూ.125 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు జూలై 4వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన వేడుకల సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.125 కోట్ల విలువైన చెక్‌ను కూడా అందజేసింది. అయితే, ఇందులో ఎవరికి ఎంత దక్కనుంది? అన్న సందేహం చాలా మందిలో తలెత్తింది. అయితే, క్రీడావర్గాల సమాచారం మేరకు ప్రపంచకప్‌లో పాల్గొ్న్న 15 మంది సభ్యులకు రూ.5 కోట్ల చొప్పున దక్కనున్నట్లు సమాచారం. కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు రూ.2.5 కోట్లు అందజేయనున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి వరల్డ్ కప్ మ్యాచ్‌లలో మొత్తం 12 మంది సభ్యులే ఆడగా, మొత్తం 15 మందికీ రూ.5 కోట్ల చొప్పున అందజేయనుందని తెలిసింది. మరోవైపు, కోచ్‌తో పాటు.. కోచింగ్ స్టాఫ్‌లోని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్‌కు కూడా రూ.2.5 కోట్ల చొప్పున దక్కనున్నాయి. ఇక.. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రూ.1 కోటి చొప్పున అందనున్నాయి. రిజర్వ్ ప్లేయర్లుగా అమెరికా, వెస్టిండీస్‌కు వెళ్లిన శుభ్‌మన్ గిల్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, రింకూ సింగ్‌కు కూడా రూ.1 కోటి చొప్పున ఇవ్వనున్నారు. ముగ్గురు ఫిజియో థెరపిస్టులు, ముగ్గురు త్రోడౌన్ స్పెషలిస్టులు, ఇద్దరు మసాజర్లు, స్ట్రెంథ్ అండ్ కండీషనింగ్ కోచ్ రూ.2 కోట్ల చొప్పున అందుకోనున్నారు.

టీమిండియాతో కలిసి పొట్టి ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు వెళ్లిన మొత్తం 42 మంది టీం సభ్యులు.. వీడియో అనలిస్టు, బీసీసీఐ స్టాఫ్ మెంబర్లు, మీడియా ఆఫీసర్లు, టీమ్ లాజిస్టిక్ మేనేజర్లకు ఈ రివార్డు అందనుంది. బీసీసీఐ నుంచి అందే రివార్డు ప్రైజ్ మనీ గురించి ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్‌కు సమాచారం అందించామని, ఇన్‌వాయిస్ అందజేయాలని వారిని కోరినట్లు బీసీసీకి చెందిన ఓ అధికారి మీడియాకు వెల్లడించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్