రికార్డు సృష్టించిన రిషబ్‌ పంత్‌.. ఐపీఎల్‌లోనే అత్యధిక ధర, శ్రేయాస్‌కు భారీగానే ధర

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తాజా వేలంలో భారత యువ ఆటగాడు, వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌పై కాసుల వర్షం కురిసింది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు పంత్‌. తాజాగా జరిగిన వేలంలో రిషబ్‌ పంత్‌ను లఖ్‌నవూ జట్టు దక్కించుకుంది. పంత్‌ కోసం సదరు జట్టు ఏకంగా రూ.27 కోట్ల రూపాయలను వెచ్చించింది. రిషబ్‌ పంత్‌ కోసం లఖ్‌నవూ, బెంగుళూరు జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. ఈ పోటీలో చివరకు లఖ్‌నవూ జట్టు రికార్డు ధర వెచ్చించి మరీ పంత్‌ను దక్కించుకుంది.

Top priced young players

అత్యధిక ధర దక్కించిన యువ ఆటగాళ్లు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తాజా వేలంలో భారత యువ ఆటగాడు, వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌పై కాసుల వర్షం కురిసింది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు పంత్‌. తాజాగా జరిగిన వేలంలో రిషబ్‌ పంత్‌ను లఖ్‌నవూ జట్టు దక్కించుకుంది. పంత్‌ కోసం సదరు జట్టు ఏకంగా రూ.27 కోట్ల రూపాయలను వెచ్చించింది. రిషబ్‌ పంత్‌ కోసం లఖ్‌నవూ, బెంగుళూరు జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. ఈ పోటీలో చివరకు లఖ్‌నవూ జట్టు రికార్డు ధర వెచ్చించి మరీ పంత్‌ను దక్కించుకుంది. ఇప్పటి వరకు ఐపీఎల్‌ చరిత్రలోనే ఒక ఆటగాడికి దక్కిన అత్యధిక ధర ఇదే కావడం గమనార్హం. టీమిండియా బ్యాటర్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ కూడా ఈ వేలంలో భారీ ధరను దక్కించుకున్నాడు. పంజాబ్‌ కింగ్జ్‌ జట్టు శ్రేయాస్‌ అయ్యర్‌ను రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. కనీస ధర రూ.2 కోట్లు ఉన్న అతడి కోసం కోల్‌కతా, ఢిల్లీ పోటీపడ్డాయి. తరువాత పంజాబ్‌ రేసులోకి వచ్చింది. చివరకు రూ.26.75 కోట్లకు పంజాబ్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది. 

కనీస ధర రూ.2 కోట్లు ఉన్న భారత పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ను రూ.18 కోట్లకు పంజాబ్‌ దక్కించుకుంది. మొదట్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ అతడి కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. మధ్యలో గుజరాత్‌, బెంగుళూరు, రాజస్థాన్‌ జట్లు ఈ ఆటగాడి కోసం తీవ్రస్థాయిలో పోటీ పడ్డాయి. ఆ తరువాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, పంజాబ్‌ కింగ్జ్‌ జట్లు రంగలోకి దిగాయి. చివరకు ఆర్‌టీఎం కార్డును ప్రయోగించి పంజాబ్‌ జట్టు రూ.18 కోట్లరకు అర్ష్‌దీప్‌ను సొంతం చేసుకుంది. తాజా వేలంలో టీమిండియా స్టార్‌ స్పన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ను రూ.18 కోట్లకు పంజాబ్‌ జట్టు సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ను రూ.17.75 కోట్లు వెచ్చించి గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు సొంతం చేసుకుంది. భారత స్టార్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ను రూ.14 కోట్లకు ఢిల్లీ, టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను రూ.12.25 కోట్లకు గుజరాత్‌ జట్టు, సౌతాఫ్రికా పేసర్‌ కగిసో రబాడను రూ.10.75 కోట్లకు గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు, మహ్మద్‌ షమిని రూ.10 కోట్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు దక్కించుకుంది. ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ లియామ్‌ లివింగ్‌ స్టోన్‌ను రూ.8.75 కోట్లకు బెంగుళూరు జట్టు సొంతం చేసుకుంది. దక్షిణాప్రికా ఆటగాడు డేవిడ్‌ మిల్లర్‌ను లఖ్‌నవూ జట్టు రూ.7.5 కోట్లకు చేజిక్కించుకుంది. గడిచిన ఏడాది రూ.24.75 కోట్లకు అమ్ముడుపోయిన మిచెల్‌ స్కార్క్‌ కోసం ఈ ఏడాది కూడా ప్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు రూ.11.75 కోట్లకు దక్కించుకుంది. తొలి రోజు వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాళ్లు వీళ్లే కావడం గమనార్హం. సోమవారం కూడా వేలం జరగనుంది. మొత్తంగా 204 మంది ఆటగాళ్లను మెగా వేలంలో ప్రాంచైజీలు దక్కించుకోనున్నాయి. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్