RCB VS RR : అరుదైన ఫీట్ కు చేరువలో కోహ్లీ.. నేటి మ్యాచ్ లో సాధించే ఛాన్స్

RCB VS RR | టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. 8 వేల పరుగుల మార్కును అందుకోవడానికి కోహ్లీ అడుగు దూరంలో నిలుచున్నారు.

virat
విరాట్ కోహ్లీ Photo: Twitter

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. 8 వేల పరుగుల మార్కును అందుకోవడానికి కోహ్లీ అడుగు దూరంలో నిలుచున్నారు. మరో 29 పరుగులు చేస్తే కోహ్లీ ఐపిఎల్ లో 8 వేల పరుగుల సాధించిన క్రికెటర్ గా నిలవనున్నాడు. ఇప్పటి వరకు కోహ్లీ 7971 పరుగులను చేశాడు. మరో 29 పరుగులు చేయడం ద్వారా ఎనిమిది వేల పరుగుల మైలు రాయిని కోహ్లీ అందుకొని ఉన్నాడు. తాజా సీజన్ లో  విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 708 పరుగులు చేశాడు. 2016 ఐపీఎల్ సీజన్ లో అత్యధికంగా కోహ్లీ 973 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఈ రికార్డును అధిగమించాలంటే కోహ్లీ మరో 266 పరుగులు చేయాల్సిన అవసరం ఉంది.

అద్భుతమైన ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ ఈ ఘనతను ఈ సీజన్ లో సాధించే అవకాశం ఉందన్న భావనను క్రికెట్ విశ్లేషకులు వినిపిస్తున్నారు. గురువారం సాయంత్రం రాజస్థాన్ రాయల్స్ తో బెంగళూరు చాలెంజర్స్ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో తలపడనుంది. ఈ మ్యాచ్ లో కోహ్లీ 29 పరుగులు చేస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాటర్ గా నిలిచే ఘనతను దక్కించుకోనున్నాడు. ప్రస్తుతం కోహ్లీ ఉన్న ఫామ్ పరిశీలిస్తే ఈ ఘనత సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్