ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌ ర్యాంక్‌కు రవిచంద్రన్ అశ్విన్

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||రవిచంద్రన్ అశ్విన్ Photo: Twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: స్టార్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ ప్లేస్‌కు చేరాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ‘బోర్డర్‌-గవాస్కర్‌’ టెస్టు సిరీస్‌లో దుమ్మురేపుతున్న అశ్విన్‌.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సత్తాచాటాడు. వరుసగా మూడు వారాలుగా బౌలింగ్‌ నంబర్‌వన్‌ స్థానం చేతులు మారుతూ వస్తోంది ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ నుంచి ఇంగ్లండ్‌ వెటరన్‌ జేమ్స అండర్సన్‌ టాప్‌ ర్యాంక్‌ను చేజిక్కించుకోగా.. ఇప్పుడు ఇంగ్లండ్‌ పేసర్‌ను వెనక్కి నెట్టి అశ్విన్‌ అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. చాన్నాళ్లుగా భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న 36 ఏళ్ల అశ్విన్‌ 2015లో తొలిసారి సుదీర్ఘ ఫార్మాట్‌లో నంబర్‌వన్‌ స్థానానికి చేరాడు. ఆ తర్వాత చాలాసార్లు తొలి ర్యాంక్‌ దక్కించుకున్న అశ్విన్‌ ప్రస్తుతం.. 864 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. జేమ్స్‌ అండర్సన్‌ (859 పాయింట్లు), కమిన్స్‌ (858 పాయింట్లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నారు. గింగిరాలు తిప్పే బంతులతో ఆసీస్‌ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న మరో భారత స్పిన్నర్‌ రవీంద్ర జడేజా కూడా ఓ ర్యాంక్‌ మెరుగు పర్చుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో జడేజా 763 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి ఎగబాకాడు. ఆస్ట్రేలియాతో జరిగిన గత రెండు టెస్టుల్లోనూ జడేజా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డులు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక గాయం కారణంగా చాన్నాళ్లుగా ఆటకు దూరమైన భారత స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా 795 పాయింట్లతో ఓ స్థానం మెరుగు పర్చుకొని నాలుగో ర్యాంక్‌కు చేరడం గమనార్హం. 

టాప్‌-5 బౌలర్లు

1. అశ్విన్‌   864

2. అండర్సన్‌  859

3. కమిన్స్‌      858

4. బుమ్రా     795

5. షాహీన్‌ షా 787


తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మన బౌలర్లు సత్తాచాటినా.. బ్యాటర్లు మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. టీమిండియా తరఫున రిషబ్‌ పంత్‌ (781 పాయింట్లు) అత్యుత్తమంగా ఎనిమిదో ర్యాంక్‌లో ఉండగా.. రోహిత్‌ శర్మ (777 పాయింట్లు) తొమ్మిదో ర్యాంక్‌కు పడిపోయాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా వన్‌డౌన్‌ బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ (912 పాయింట్లు) టాప్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో క్లిష్ట పరిస్థితుల్లో శతకంతో విజృంభించిన జో రూట్‌ (871 పాయింట్లు) రెండు స్థానాలు ఎగబాకి.. మూడో ర్యాంక్‌కు చేరాడు. ఇంగ్లండ్‌ యువ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ ఏకంగా 15 స్థానాలు మెరుగు పర్చుకొని భారత మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో కలిసి సంయుక్తంగా 16వ ప్లేస్‌లో నిలిచాడు.


టాప్‌-5 బ్యాటర్లు

1. లబుషేన్‌      912

2. స్మిత్‌           875

3. రూట్‌          871

4. బాబర్‌         862

5. హెడ్‌            826

ఆల్‌రౌండర్ల జాబితాలో మాత్రం మనవాళ్లు దుమ్మురేపుతున్నారు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో విశ్వరూపం కనబరుస్తున్న భారత స్పిన్‌ త్రయం.. జడేజా, అశ్విన్‌, అక్షర్‌.. ఆల్‌రౌండర్ల టాప్‌-5లో చోటు దక్కించుకున్నారు. జడ్డూ టాప్‌లో ఉండగా.. అశ్విన్‌ రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. అక్షర్‌ ఐదో ప్లేస్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్‌ స్టార్‌ జో రూట్‌ ఎనిమిదో ప్లేస్‌కు చేరాడు.

టాప్‌-5 ఆల్‌రౌండర్లు

1. జడేజా       460

2. అశ్విన్‌       376

3. షకీబ్‌    329

4. స్టోక్స్‌        307

5. అక్షర్‌        283


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్