SRH vs LSG : పూరన్‌ పూనకాలే.. హైదరాబాద్‌పై లక్నో గెలుపు

ఐపీఎల్‌-18లో లక్నో బోణీ కొట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 191 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన లక్నో బ్యాటర్లు 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించారు.

srh vs lsg

దంచికొట్టిన పూరన్, మిచెల్ మార్ష్

ఈవార్తలు, హైదరాబాద్ : ఐపీఎల్‌-18లో లక్నో బోణీ కొట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 191 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన లక్నో బ్యాటర్లు 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించారు. పూరన్‌ (70 - 26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) హైదరాబాద్ బౌలర్లతో ఆడుకున్నాడు. మరో బ్యాటర్‌ మిచెల్‌ మార్ష్‌ (52 - 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగి ఆడాడు. వీరిద్దరి దూకుడు ఆటతో లక్నో విజయంవైపు దూసుకెళ్లింది. చివర్లో అబ్దుల్‌ సమద్‌ (22*) కూడా దూకుడుగా ఆడి లక్నోను గెలిపించాడు. హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్‌ 2, షమీ, జంపా, హర్షల్‌పటేల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 190 రన్స్ చేసింది. హెడ్‌ (47), నితీశ్‌ రెడ్డి (32), అనికేత్‌ (36) క్లాసెన్‌ (26) రాణించారు. ఓపెనర్ హెడ్ (47 - 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా, మిడిల్ ఆర్డర్‌లో అనికేత్ వర్మ (36 - 13 బంతుల్లో) క్రీజులో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. నితీశ్‌ రెడ్డి (32 - 28 బంతుల్లో), క్లాసెన్ (26 - 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) రన్స్ చేశారు. కమిన్స్ (18; 4 బంతుల్లో) హ్యాట్రిక్‌ సిక్స్‌లు బాది ఔటయ్యాడు. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ (4/34) అద్భుతంగా బౌలింగ్ చేశాడు 

ఆరంభంలోనే హైదరాబాద్‌కు షాక్‌లు

బ్యాటింగ్ ప్రారంభించిన వెంటనే సన్‌రైజర్స్‌కు వరుస షాక్‌లు తగిలాయి. తొలి రెండు ఓవర్లలో 15 పరుగులే వచ్చాయి. మూడో ఓవర్‌ వేసిన శార్దూల్ ఠాకూర్ వరుస బంతుల్లో అభిషేక్ శర్మ, ఇషాన్‌ కిషన్‌‌ను ఔట్ చేశాడు. అవతలి ఎండ్‌లో హెడ్ దూకుడుగా ఆడాడు. అటు. అనికేత్ కూడా ఆరంభం నుంచే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. నితీశ్ ఔటైనా అనికేత్ చెలరేగాడు. చివరి రెండు ఓవర్లలో సన్‌రైజర్స్ 10 పరుగులే చేయడంతో స్కోరు 190కే పరిమితమైంది. అలవోకగా 200 స్కోర్‌ను దాటిస్తున్న హైదరాబాద్ ఈసారి మాత్రం ఆ మార్కును అందుకోలేకపోయింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్