పాక్ క్రికెట్ బోర్డు కొంపముంచిన ఛాంపియన్ ట్రోఫీ నిర్వహణ.. భారీగా నష్టపోయిన పిసిబి.!

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు కోట్లలో ఉన్నారు. ఐసీసీ ఈవెంట్ నిర్వహిస్తే కోట్ల రూపాయల మేర ఆదాయం లభిస్తుంది. ఐసీసీ ఈవెంట్ నిర్వహించే దేశాలు కోట్లాది రూపాయల ఆర్జనతో భారీగా లబ్ధి పొందుతాయి. అందుకే ఐసీసీ ఈవెంట్లో నిర్వహించేందుకు అనేక దేశాలు పోటీ పడుతుంటాయి. అయితే తాజాగా ఛాంపియన్ ట్రోఫీ నిర్వహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇందుకు విరుద్ధంగా తీవ్ర నష్టాలను చెవి చూసింది. సాధారణంగా ఐసిసి ఈవెంట్ నిర్వహించే క్రికెట్ బోర్డులు కోట్లాది రూపాయలను ఆర్జిస్తాయి. అందుకు విరుద్ధంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సుమారు రూ.800 కోట్ల రూపాయలను నష్టపోవాల్సి వచ్చింది.

Pakistan Cricket Board

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు కోట్లలో ఉన్నారు. ఐసీసీ ఈవెంట్ నిర్వహిస్తే కోట్ల రూపాయల మేర ఆదాయం లభిస్తుంది. ఐసీసీ ఈవెంట్ నిర్వహించే దేశాలు కోట్లాది రూపాయల ఆర్జనతో భారీగా లబ్ధి పొందుతాయి. అందుకే ఐసీసీ ఈవెంట్లో నిర్వహించేందుకు అనేక దేశాలు పోటీ పడుతుంటాయి. అయితే తాజాగా ఛాంపియన్ ట్రోఫీ నిర్వహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇందుకు విరుద్ధంగా తీవ్ర నష్టాలను చెవి చూసింది. సాధారణంగా ఐసిసి ఈవెంట్ నిర్వహించే క్రికెట్ బోర్డులు కోట్లాది రూపాయలను ఆర్జిస్తాయి. అందుకు విరుద్ధంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సుమారు రూ.800 కోట్ల రూపాయలను నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పీసీబీ.. ఛాంపియన్ ట్రోఫీ నిర్వహణ వల్ల వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తుంది. అసలు ఈ స్థాయిలో నష్టం రావడానికి గల కారణాలను పరిశీలిస్తే అనేకం కనిపిస్తున్నాయి. 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టౌన్ నేనే నిర్వహించే అవకాశం రావడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లాహోర్, కరాచి, రావలపిండి స్టేడియాలను ఆధునికరించింది. ఇందుకోసం రూ.503 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఇది పిసిబి అంచనా వేసిన బడ్జెట్ కంటే 50% ఎక్కువ. అలాగే ఈవెంట్ నిర్వహణ కోసం మరో రూ.347 కోట్ల రూపాయలను వెచ్చించింది. ఈ మొత్తాన్ని ఐసీసీ నుంచి ఆతిధ్య ఫీజు, టికెట్ల అమ్మకాలు, స్పాన్సర్షిప్ ద్వారా పిసిబికి భారీగా మొత్తం రావాల్సి ఉంది. అయితే రూ.52 కోట్లు మాత్రమే రావడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్ద ఎత్తున నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేరుకే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించింది.

కానీ పాకిస్తాన్ జట్టు స్వదేశంలో ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడింది. న్యూజిలాండ్తో ఆడిన ఆ ఒక్క మ్యాచ్లో కూడా పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది. ఆ తరువాత భారత్ తో ఆడిన మ్యాచ్ దుబాయిలో ఆడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో కూడా పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది. చివరి మ్యాచ్ బంగ్లా తో స్వదేశంలో ఆడాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయింది.  దీంతో ఛాంపియన్ ట్రోఫీ నిర్వహించిన పాకిస్తాన్ జట్టు ఏకైక మ్యాచ్ మాత్రమే తమ దేశంలో ఆడాల్సి వచ్చింది. దీంతో భారీగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ వల్ల రూ.737 కోట్ల రూపాయలు నష్టాలు వాటిల్లాయి. ఈ భారీ మొత్తాన్ని పూడ్చుకునేందుకు ఇప్పుడు పిసిబి పొదుపు చర్యలకు దిగింది. జాతీయ టి20 ఛాంపియన్షిప్ ఆడే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజును ఎలాంటి సమాచారం లేకుండానే 40 వేల నుంచి పదివేలకు తగ్గించినట్లు పాక్ మీడియా వెల్లడించింది. అంతేకాకుండా స్టార్ హోటల్లో కాకుండా ఎకానమీ హోటలలో ఆటగాళ్లు సర్దుకుపోవాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఆటగాళ్ల ఫీజును భార్యకే తగ్గించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో 30 వేలుకు ఖరారు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీని నిర్వహించిన పాకిస్తాన్ కు తీవ్ర నష్టాలు వాటిల్లడం ఆ దేశ క్రికెట్ బోర్డును మరింత ఇబ్బందుల్లోకి నెట్టినట్టు అయింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్