ఈ నెల 13న వినేశ్ ఫొగాట్ చేసి తీర్పు.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న యావత్ క్రీడాలోకం

భారత స్టార్ రెజ్లర్, పారిస్ ఒలంపిక్స్ లో 100 గ్రాముల బరువు అధికంగా ఉండడంతో తృటిలో పతకాన్ని చేజార్చుకోవాల్సి వచ్చిన వినేశ్ ఫొగాట్ సస్పెన్షన్స్ కు గురైన విషయం తెలిసిందే. ఈ వేటు మరో రెండు రోజులపాటు కొనసాగు నుండి. తనపై అనర్హత వేటను భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ క్రీడ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (సిఏఎస్)లో సవాల్ చేసింది. దీనిపై సిఏఎస్ అడ్ హక్ డివిజన్ ఎదుట శుక్రవారం వాదనలు జరిగాయి.

Vinesh Phogat

వినేశ్ ఫొగాట్  

భారత స్టార్ రెజ్లర్, పారిస్ ఒలంపిక్స్ లో 100 గ్రాముల బరువు అధికంగా ఉండడంతో తృటిలో పతకాన్ని చేజార్చుకోవాల్సి వచ్చిన వినేశ్ ఫొగాట్  సస్పెన్షన్స్ కు గురైన విషయం తెలిసిందే. ఈ వేటు మరో రెండు రోజులపాటు కొనసాగు నుండి. తనపై అనర్హత వేటను భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ క్రీడ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (సిఏఎస్)లో సవాల్ చేసింది. దీనిపై సిఏఎస్ అడ్ హక్ డివిజన్ ఎదుట శుక్రవారం వాదనలు జరిగాయి. వినేశ్ ఫొగాట్ తరపున ఫ్రెంచ్ లాయర్లు, భారత ఒలంపిక్ సంఘం తరఫున హరీష్ సాల్వే, విదుష్పత్ సింఘానియా, అలాగే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ), అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం (ఐఒసీ) తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. సి ఏ ఎస్ శనివారం తన తీర్పు వెలువరిస్తుందని అంతా భావించారు. అయితే ఒలంపిక్స్ ముగిసిన తరువాత తీర్పు వెల్లడించాలని అడ్ హక్ కమిటీ నిర్ణయించినట్లు భారత ఒలంపిక్ సంఘం (ఐఓఏ) తెలిపింది. ఈనెల 13 సాయంత్రం 6 గంటలకు ఆర్బిట్రేటర్ జస్టిస్ అనాబెల్ బెనెట్టు తీర్పు వెలువరించనున్నారు. ఈ నేపథ్యంలో దేశమంతా ఈ తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే వినేశ్ ఫొగాట్ కు ఒలంపిక్ విజేత ఓదార్పు సందేశాన్ని అందించారు. అందివచ్చిన పతకం చేజారడం ఎంత బాధాకరమో తనకు తెలుసునని ఒలంపిక్ ఛాంపియన్, జపాన్ రెజ్లర్ రీ హిగుచి పేర్కొన్నారు. పారిస్ ఒలంపిక్స్ పురుషుల 50 కిలోలు ప్రీ స్టైల్ రెజ్లింగ్ లో స్వర్ణ పతకం సాధించిన 28 ఏళ్ల రీ.. రియో ఒలంపిక్స్ లో ఇదే విభాగంలో రజత పతకం సాధించాడు. అయితే, టోక్యో గేమ్స్ లో నిర్ణీత బరువు కంటే 50 గ్రాములు అదనంగా ఉండడంతో అనర్హతకు గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే  

వినేశ్ ఫొగాట్ కు భరోసాను కల్పించేలా ఆయన సందేశాన్ని అందించారు. నీ బాధను తాను అర్థం చేసుకోగలరని, తనది 50 గ్రాముల బాధ అని, నీ చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటున్నారో అని ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. జీవితం సాగుతూనే ఉంటుందని, ఎదురు దెబ్బలను తట్టుకొని లేచి నిలబడడం ఎంతో గొప్పగా ఉంటుందన్నారు. తగిన విశ్రాంతి తీసుకోవాలని వినేశ్ ఫొగాట్ కు రీ హిగుచి సూచించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్