IND vs NZ | టీమిండియా నడ్డి విరిచిన న్యూజిలాండ్ స్పిన్నర్ .. అజాజ్ పటేల్ మేడిన్ ముంబై

మూడో టెస్ట్‌లో టీమిండియా నడ్డి విరిచిన న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ అయ్యాడు. స్పిన్ ఆడటంలో ప్రపంచంలోనే మేటి బ్యాటర్లు ఉన్న టీమిండియా కూడా.. అజాజ్ స్పిన్ మాయాజాలం ముందు మోకరిల్లింది.

azaz patel

న్యూజిలాండ్ క్రికెటర్ అజాజ్ పటేల్

ఈవార్తలు డెస్క్ : మూడో టెస్ట్‌లో టీమిండియా నడ్డి విరిచిన న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ అయ్యాడు. స్పిన్ ఆడటంలో ప్రపంచంలోనే మేటి బ్యాటర్లు ఉన్న టీమిండియా కూడా.. అజాజ్ స్పిన్ మాయాజాలం ముందు మోకరిల్లింది. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఈ బౌలర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 5 వికెట్లు తీసి 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకీ పేరులోనే భారత మూలాలు కలిగిన ఈ స్పిన్ బౌలర్ ఎక్కడివాడు? అంటే.. పుట్టింది ముంబైలోనే. అయితే, కెరీర్ తొలినాళ్లలోనే న్యూజిలాండ్‌కు వెళ్లిన ఈ బౌలర్.. దీపక్ పటేల్, జీతన్ పటేల్ బాటలోనే నడిచాడు. 2012లోనే తన డెబ్యూ మ్యాచ్ ఆడిన అజాజ్ పటేల్.. మిచెల్ సాంట్నర్, ఇష్ సోది లాంటి మేటి బౌలర్లు ఉండటంతో జాతీయ జట్టులో చోటు సంపాదించలేకపోయాడు.2018లో తొలిసారి న్యూజిలాండ్ జాతీయ జట్టులో పాకిస్థాన్‌తో సిరీస్‌లో అవకాశం లభించింది. తొలి టెస్ట్‌లోనే అద్భుత ప్రదర్శన కనబర్చి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆర్తోడాక్స్ బౌలింగ్ స్టైల్‌తో ప్రస్తుత మ్యాచ్‌లో అదరగొట్టాడు. 36 ఏళ్ల ఈ బౌలర్.. తన సొంత మైదానం వాంఖడే స్టేడియంలో స్పిన్‌తో రెచ్చిపోతున్నాడు. 

కాగా, న్యూజిలాండ్‌ క్రికెటర్ జీతన్ పటేల్ కూడా భారత్‌ మూలాలు ఉన్నవాడే. గుజరాత్‌లోని నవ్‌సరీకి చెందిన జీతన్.. న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లో పెరిగాడు. అక్కడే క్రికెట్ ఆడుతూ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. 9 దేశాల జట్లలో భారతీయ మూలాలు ఉన్న క్రికెటర్లు కొనసాగారు.. కొనసాగుతున్నారు. ఇష్ సోది (పంజాబ్), రవి బొపారా (పంజాబ్), హషీమ్ ఆమ్లా (సూరత్), మాంటీ పనేసర్ (పంజాబ్), రచిన్ రవీంద్ర (బెంగళూరు), నాజర్ హుస్సేన్ (చెన్నై), చందర్ పాల్ (ఇండియా), సెనురన్ ముత్తుస్వామి (తమిళనాడు), కేశవ్ మహారాజ్ (ఉత్తరప్రదేశ్), విక్రమ్ జిత్ సింగ్-నెదర్లాండ్స్ (పంజాబ్), తేజ నిడమనూరు-నెదర్లాండ్స్ (విజయవాడ) తదితరులు వేరే దేశాలకు ఆడినవారే.. కొందరు ప్రస్తుతం ఆడుతున్నవారూ ఉన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్