వరల్డ్ కప్ గెలిచి.. టీమిండియా ముంబై చేరుకున్న తరుణంలో గురువారం పాండ్యా భార్య నటాసా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
నటాసా పాండ్యా
గుజరాత్ టైటాన్స్‌ను వీడి ముంబై కెప్టెన్‌గా రావటంతో రోహిత్ శర్మ అభిమానుల నుంచి ట్రోల్స్.. మావాడి కెప్టెన్సీ లాక్కున్నాడని ఆగ్రహం.. పైగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఘోర పరాభవం.. అదే సమయంలో తన భార్య నటాసా స్టాంకోవిచ్‌తో విడిపోతున్నాడని, విడాకులు తీసుకుంటున్నారని రూమర్స్.. నటాసా తన బాయ్ ఫ్రెండ్‌తో తిరుగుతోందని మరో రూమర్.. ఇలా హార్దిక్ పాండ్యా చాలా కుంగిపోయాడు. అయినా పట్టుదలతో టీ20 వరల్డ్ కప్‌కు సన్నద్ధమయ్యాడు. తనను తాను పోరాటయోధుడిగా మలచుకున్నాడు. ఆల్ రౌండ్ ప్రతిభతో మెరిసి, దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కీలక వికెట్లు తీసి భారత్‌కు 17 ఏండ్ల కలను తీర్చడంతో కీలక పాత్ర పోషించాడు. అయితే, నటాసాతో విడాకులపై మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.
వరల్డ్ కప్ గెలిచి.. టీమిండియా ముంబై చేరుకున్న తరుణంలో గురువారం పాండ్యా భార్య నటాసా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘జీవితంలో కొన్ని పరిస్థితుల్లో మనం ఒంటరిగా ఉండొచ్చు. ఆ సమయంలో మనతో ఎవరూ తోడుగా లేరని బాధపడటం అవసరం లేదు. అన్నిటికీ దేవుడే ఉన్నాడు. మనకు ఏమేం కావాలో ఆయనకే బాగా తెలుసు’ అని పోస్ట్ చేస్తూ వీడియోను జత చేసింది. ఆ పోస్ట్ పాండ్యా అభిమానులను మరింత సందిగ్ధంలో పడేసింది. ఒంటరిగా ఉండటం అంటే.. విడిపోతున్నారా? పాండ్యా భాయ్‌ను విడిచి వెళ్లొద్దు అంటూ కామెంట్లు పెడుతున్నారు.