ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసిఏ) అధ్యక్ష పీఠంపై తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని దృష్టి సారించారు. కొద్ది రోజుల కిందటి వరకు ఎంపీ విజయసాయిరెడ్డి టీమ్ ఏసిఏ వ్యవహారాలను నడిపిస్తూ వచ్చింది. విజయసాయి రెడ్డి అల్లుడు అన్న, అరబిందో గ్రూపునకు చెందిన పి శరత్ చంద్రారెడ్డి రెండు దఫాలు ఏసీఏ అధ్యక్షుడిగా పని చేశారు. ఉపాధ్యక్షుడిగా సాయి రెడ్డి అల్లుడు పి రోహిత్ రెడ్డి ఉన్నారు. కార్యదర్శిగా ఎస్సార్ గోపీనాథ్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా రాకేష్, కోశాధికారిగా ఏవి చలం పని చేశారు.
ఎంపీ కేశినేని చిన్ని
ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసిఏ) అధ్యక్ష పీఠంపై తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని దృష్టి సారించారు. కొద్ది రోజుల కిందటి వరకు ఎంపీ విజయసాయిరెడ్డి టీమ్ ఏసిఏ వ్యవహారాలను నడిపిస్తూ వచ్చింది. విజయసాయి రెడ్డి అల్లుడు అన్న, అరబిందో గ్రూపునకు చెందిన పి శరత్ చంద్రారెడ్డి రెండు దఫాలు ఏసీఏ అధ్యక్షుడిగా పని చేశారు. ఉపాధ్యక్షుడిగా సాయి రెడ్డి అల్లుడు పి రోహిత్ రెడ్డి ఉన్నారు. కార్యదర్శిగా ఎస్సార్ గోపీనాథ్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా రాకేష్, కోశాధికారిగా ఏవి చలం పని చేశారు. వీరంతా విజయసాయి మనుషులుగా గుర్తింపు పొందారు. రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఏసీఏ కార్యవర్గం మూకుమ్మడిగా కొద్దిరోజులు కిందట రాజీనామాలు చేసింది. సెప్టెంబర్ 8న గుంటూరులో ఏసీఏ నూతన కార్యవర్గం ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఏసీఏకి కాబోయే అధ్యక్షుడు ఎవరన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఏసీఏలో ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాల క్రికెట్ సంఘాలు, రాష్ట్ర వ్యాప్తంగా 18 క్రికెట్ క్లబ్బులు, ముగ్గురు అంతర్జాతీయ క్రీడాకారులతో కలుపుకొని మొత్తంగా 34 మంది సభ్యులుగా ఉన్నారు. వీరంతా విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్ (చి) నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రాగానే ఏసీఏను విజయసాయి టీమ్ నుంచి విముక్తి చేసే బాధ్యతను కేశినేని చిన్ని తీసుకున్నారు. జిల్లా అసోసియేషన్ లో క్రికెట్ క్లబ్బులతో మాట్లాడి గత పాలక వర్గాన్ని సాగనంపేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే గత పాలకవర్గం వివాదానికి తెరదీయకుండా మూకుమ్మడి రాజీనామాలు సమర్పించి బయటకు వెళ్లిపోయింది.
ఈ పరిణామాలతో కేశినేని చిన్నిని అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైందన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో జరిగే కార్యవర్గ ఎన్నికల్లో ఆయనను ఎంపిక చేసుకుంటారని చెబుతున్నారు. దాదాపు కేశినేని చిన్ని అధ్యక్షుడిగా ఎన్నిక కావడం లాంచనమేనని ఏసీఏ సభ్యులు చెబుతున్నారు. టిడిపిలో కూడా ఏసీఏ అధ్యక్ష పీఠాన్ని కోరుకుంటున్న వారు ఎవరూ లేకపోవడంతో పెద్దగా పోటీ ఉండకపోవచ్చన్న భావన వ్యక్తం అవుతోంది. అధ్యక్ష పీఠంపై కూర్చునేందుకు చిన్ని కూడా ఆసక్తిని కనబరుస్తుండడం సానుకూల అంశంగా చెబుతున్నారు. అదే సమయంలో విజయ్ సాయి రెడ్డి టీమ్ ను సాగనంపడంలో కూడా చిన్ని కీలకపాత్ర పోషించడంతో ప్రస్తుతం సభ్యులంతా ఆయన వైపే ముగ్గు చూపుతున్నారు. చిన్ని కాదనుకొని ఎవరినైనా తెరపైకి తీసుకువస్తే తప్ప దాదాపు ఏసీఏ అధ్యక్షుడిగా కేశినేని చిన్ని నియామకం ఖరారైనట్టుగానే చెబుతున్నారు. అధ్యక్షుడి మార్పు తర్వాత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. వాస్తవానికి ఏసిఏకు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. బీసీసీఐ నియంత్రణలో ఏసిఏ పని చేస్తుంటుంది. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి నిధులు రావు. అయినా, సరే ఏ సి ఏ అధ్యక్ష పదవిని రాజకీయ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడంతో ఇందులో రాజకీయ జోక్యం పెరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంపీ విజయసాయి రెడ్డికి చెందిన మనసులు ఇందులో చక్రం తిప్పారు. దీంతో టిడిపి కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత పాలకు వర్గానికి చెక్ పెట్టి కొత్త కార్యవర్గాన్ని నియమించేందుకు సిద్ధమవుతోంది.