అరేనా : మిస్ యూనివర్స్ 2024గా డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా క్జెర్ థెల్విగ్ అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా 120 మందిని వెనక్కి నెట్టి మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఈ21 ఏళ్ల భామ దక్కించుకుంది.
ప్రతీకాత్మక చిత్రం
అరేనా : మిస్ యూనివర్స్ 2024గా డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా క్జెర్ థెల్విగ్ అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా 120 మందిని వెనక్కి నెట్టి మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఈ21 ఏళ్ల భామ దక్కించుకుంది. శనివారం మెక్సికో సిటీలోని అరెేనా సీడీఎంఎక్స్‌లో నిర్వహించిన 73వ మిస్ యూనివర్స్ పోటీల్లో విక్టోరియా నంబర్ వన్‌గా నిలవగా, మొదటి రన్నరప్‌గా నైజీరియాకు చెందిన చిడిన్మా అడెత్షినా, రెండో రన్నరప్‌గా మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్ట్రాన్ ఎంపికయ్యారు. మూడో రన్నరప్‌గా థాయ్‌లాండ్‌కు చెందిన ఒపాల్ సుచతా చువాంగ్‌స్రీ, నాలుగో రన్నరప్‌గా వెనిజులాకు చెందిన ఇలియానా మార్క్వెజ్ ఉన్నారు. 73వ మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి చరిత్రలోనే అత్యధికంగా 125 ఎంట్రీలు నమోదయ్యాయి.ఇండియాకు చెందిన రియా సింఘా గ్రాండ్ ఫినాలేలో పాల్గొంది. ఆమె టాప్ 30లో స్థానం సంపాదించుకుంది. మిస్ యూనివర్స్ 2024 కిరీటం ఈసారి ప్రత్యేకంగా ఉండటంతో, దీనికి 'లూమియర్ డి ఎల్ ఇన్ఫిని' అనే పేరు పెట్టారు.ఈ కిరీటాన్ని వజ్రాలతో పాటు 23 బంగారు ముత్యాలతో రూపొందించారు. ఫిలిపినో కళాకారులు 2 సంవత్సరాలపాటు సంప్రదాయ పద్ధతులను ఉపయోగించి దీన్ని తయారు చేశారు.
.jpeg)