మరో పతకంపై గురిపెట్టిన మనుభాకర్.. నేడు ఫైనల్ మ్యాచ్

పారిస్ ఒలంపిక్స్ లో అదరగొడుతున్న మనుభాకర్ మరో పథకంపై గురి పెట్టింది. ప్రస్తుతం మంచి టచ్ లో ఉన్న మను భాకర్ ఇప్పటికే రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. తాజాగా ఫైనల్లోకి అడుగుపెట్టిన ఆమె మరో పథకాన్ని సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. స్టార్ షూటర్ మనుభాకర్ హ్యాట్రిక్ కొట్టి ఇంత వరకు భారత క్రీడా చరిత్రలో ఎవరు సాధించని ఘనత సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

manubhakar

మనుభాకర్ 

పారిస్ ఒలంపిక్స్ లో అదరగొడుతున్న మనుభాకర్ మరో పథకంపై గురి పెట్టింది. ప్రస్తుతం మంచి టచ్ లో ఉన్న మను భాకర్ ఇప్పటికే రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. తాజాగా ఫైనల్లోకి అడుగుపెట్టిన ఆమె మరో పథకాన్ని సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. స్టార్ షూటర్ మనుభాకర్ హ్యాట్రిక్ కొట్టి ఇంత వరకు భారత క్రీడా చరిత్రలో ఎవరు సాధించని ఘనత సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. విశ్వ క్రీడల్లో మూడో పథకాన్ని సాధించడంపై ప్రస్తుతం దృష్టి సారించిన ఆమె శనివారం 25 మీటర్ల ఫిస్టల్ ఫైనల్లో తలపడనుంది. ఇప్పటికే రెండు పతకాలు సాధించి మంచి టచ్ లో ఉన్న మను భాకర్ ఈ పతకాన్ని కూడా సాధిస్తే క్రీడా చరిత్రలో ఆమె పేరు సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నట్టు అవుతుంది. ఇప్పటికే మహిళల పది మీటర్ల ఫిస్టల్ మిక్స్డ్ టీమ్ పది మీటర్ల ఫిస్టల్ ఈవెంట్లో కాంస్య పతకాలను మను భాకర్ గెలుచుకున్నారు. మూడో పతకం సాధిస్తే కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. భారతీయులంతా ప్రస్తుతం మను భాకర్ ఫైనల్ మ్యాచ్ పై దృష్టిని కేంద్రీకరించారు. శనివారం ఆర్చరీలో దీపికా కుమారి మళ్లీ బరిలోకి దిగనుంది. భారత ఆర్చరీలో దీపిక కుమారి, భజన్ కౌర్ తోపాటు బాక్సర్ నిశాంత్ దేవ్ కూడా బరిలోకి దిగనున్నారు. మూడుసార్లు ఒలింపియన్ దీపికా కుమారి 18 ఏళ్ల భజన్ కౌర్ తో కలిసి మహిళల వ్యక్తిగత అర్చరీలో పాల్గొననుంది.  

ఇవాల్టి భారత షెడ్యూల్ ఇదే 

శనివారం భారత్కు చెందిన పలువురు ఆటగాళ్లు పలు విభాగాల్లో పోటీ పడనున్నారు. మహిళల వ్యక్తిగత రౌండు 16 లో దీపికా కుమారి vs మేడ్చల్ క్రోపెన్, మహిళల వ్యక్తిగత సెమీ ఫైనల్ (అర్హత సాధిస్తే), మహిళల వ్యక్తిగత క్వార్టర్ ఫైనల్ (అర్హత సాధిస్తే), మహిళల వ్యక్తిగత సెమీఫైనల్ (అర్హత సాధిస్తే), మహిళల వ్యక్తిగత కాంస్య పతక మ్యాచ్ (అర్హత సాధిస్తే), మహిళల వ్యక్తిగత గోల్డ్ మెడల్ మ్యాచ్ (అర్హత సాధిస్తే), పురుషుల 75 కేజీల క్వార్టర్ ఫైనల్ - నిషాంత్ దేవ్ - మార్కో అలాన్సో అల్వారేజ్, గోల్ఫ్ పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ రౌండ్ 3 - శుభంకర్ శర్మ, గగన్ జీత్ భుల్లర్, సైలింగ్ పురుషుల డింగీరేస్ 5తోపాటు మరికొన్ని విభాగాల్లో భారత ఆటగాళ్లు పోటీ పడనున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్