ఆర్సిబిని వదిలేయంటూ కోహ్లీకి సూచించిన కెవిన్ పీటర్సన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇప్పటి వరకు ఒక్క ట్రోఫీ కూడా గెలవని జట్టుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచింది. కోట్లాదిbమంది అభిమానుల ఆశలను వమ్ము చేస్తూ ఆ జట్టు ఎప్పటికప్పుడు నిరాశపరుస్తూ లీగ్ నుంచి నిష్క్రమిస్తోంది. ఈ సీజన్ లో కూడా వరుసగా మొదట ఆడిన మ్యాచ్ ల్లో ఓటమిపాలైన బెంగళూరు జట్టు.. ఆ తరువాత అద్భుతంగా పుంజుకొని వరుస విజయాలను సాధించి క్వాలిఫైయర్ వరకు చేరుకుంది.

విరాట్ కోహ్లీ, కెవిన్ పీటర్సన్
విరాట్ కోహ్లీ, కెవిన్ పీటర్సన్


ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇప్పటి వరకు ఒక్క ట్రోఫీ కూడా గెలవని జట్టుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచింది. కోట్లాది మంది అభిమానుల ఆశలను వమ్ము చేస్తూ ఆ జట్టు ఎప్పటికప్పుడు నిరాశపరుస్తూ లీగ్ నుంచి నిష్క్రమిస్తోంది. ఈ సీజన్ లో కూడా వరుసగా మొదట ఆడిన మ్యాచ్ ల్లో ఓటమిపాలైన బెంగళూరు జట్టు.. ఆ తరువాత అద్భుతంగా పుంజుకొని వరుస విజయాలను సాధించి క్వాలిఫైయర్ వరకు చేరుకుంది. క్వాలిఫైయర్ -1 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడిన ఈ జట్టు.. తక్కువ స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో బెంగుళూరు జట్టు ఆటగాళ్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ జట్టు మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్.. బెంగళూరు జట్టు ఆటగాడు, మాజీ సారథి విరాట్ కోహ్లీకి కీలక సూచన చేసాడు. 'ఈ మాట నేను గతంలో చెప్పాను. ఇప్పుడు చెబుతున్న. కోహ్లీ 17 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ టైటిల్ అందుకోలేకపోయాడు. అయిందేదో అయిపోయింది. విరాట్ ఇప్పటికైనా ఆర్సీబీను వీడి వేరే జట్టుకు వెళితే తన ఐపీఎల్ కప్ కలను అతడు నిజం చేసుకోగలడు' అని పీటర్సన్ స్పష్టం చేశాడు. అంతేకాకుండా కోహ్లీ ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడటం ఉత్తమని సూచించాడు. ఇందుకు రెండు కారణాలను అతడు చెప్పాడు. ఒకటి ఢిల్లీ విరాట్ కు సొంత ప్రదేశం అని, రెండోది ఐపీఎల్ టైటిల్ కోసం ఢిల్లీ జట్టు ఆకలిగొన్న పులిలా ఉంది అని పీటర్సన్ వివరించాడు. ఇదిలా ఉంటే చెన్నై జట్టుపై ఆఖరి లీగ్ మ్యాచ్ లో విజయం సాధించిన అనంతరం బెంగళూరు అభిమానులు చేసిన అతిని టీమిండియా మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తప్పు పట్టాడు. 'అతి సంబరాల వీడియోలను, ఫోటోలను బెంగుళూరు అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాల్సింది. అలా అతి చేసిన వారికి స్పిన్నర్ అశ్విన్ తన బౌలింగ్ తో బుద్ధి చెప్పాడు. అందువల్ల క్రికెట్ లో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడాలి' అని పరోక్షంగా బెంగుళూరు జట్టుకు కో చురకలు అంటించాడు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్