కబడ్డీ అభిమానులను కనువిందు చేసేందుకు మరోసారి ప్రో కబడ్డీ లీగ్ సిద్ధమవుతోంది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11 హైదరాబాద్ వేదికగా శుక్రవారం ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో 2018 ఛాంపియన్ బెంగళూరు బుల్స్ తో తెలుగు టైటాన్స్ పోటీ పడనుంది. మరో మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీతో యు ముంబై ఢీకొట్టనుంది. ఆటగాళ్లు మారినా, పది సీజన్లు గడిచిన ఇప్పటి వరకు పీకేఎల్ టైటిల్ ను తెలుగు టైటాన్స్ జట్టు గెలుచుకోలేకపోయింది. గురువారం రాత్రి నగరంలోని ఓ హోటల్లో జరిగిన ట్రోఫీ ఆవిష్కరణలో 12 జట్ల కెప్టెన్లు ట్రోఫీతో ఫోటోకు ఫోజులిచ్చారు. ఈ టోర్నీలో భాగంగా వచ్చేనెల 9 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తొలి అంచె పోటీలు జరగనున్నాయి.
ట్రోఫీతో 12 జట్ల కెప్టెన్లు
కబడ్డీ అభిమానులను కనువిందు చేసేందుకు మరోసారి ప్రో కబడ్డీ లీగ్ సిద్ధమవుతోంది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11 హైదరాబాద్ వేదికగా శుక్రవారం ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో 2018 ఛాంపియన్ బెంగళూరు బుల్స్ తో తెలుగు టైటాన్స్ పోటీ పడనుంది. మరో మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీతో యు ముంబై ఢీకొట్టనుంది. ఆటగాళ్లు మారినా, పది సీజన్లు గడిచిన ఇప్పటి వరకు పీకేఎల్ టైటిల్ ను తెలుగు టైటాన్స్ జట్టు గెలుచుకోలేకపోయింది. గురువారం రాత్రి నగరంలోని ఓ హోటల్లో జరిగిన ట్రోఫీ ఆవిష్కరణలో 12 జట్ల కెప్టెన్లు ట్రోఫీతో ఫోటోకు ఫోజులిచ్చారు. ఈ టోర్నీలో భాగంగా వచ్చేనెల 9 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తొలి అంచె పోటీలు జరగనున్నాయి. నవంబర్ 10 నుంచి నొయిడాలో రెండో అంచె పోటీలు జరగనున్నాయి. డిసెంబర్ మూడో తేదీ నుంచి 24 వరకు పూణేలో మూడో అంచె పోటీలు జరగనున్నాయి. లీగ్ లో ప్లే ఆఫ్స్ తోసహా మొత్తంగా 137 మ్యాచులు జరగనున్నాయి. గత సీజన్ లో తెలుగు టైటాన్స్ 22 మ్యాచుల్లో రెండే గెలిచి అవమానకర రీతిలో లీగ్ నుంచి నిష్క్రమించింది. గడిచిన సీజన్ లో జట్టు పగ్గాలు తీసుకున్న స్టార్ రైడర్ పవన్ శెహ్రావత్ ఆటగాడిగా రాణించిన సారధిగా టీమ్ ను విజయపథంలో నడపలేకపోయాడు. అయితే ఈసారి జట్టులోకి కొత్త ప్లేయర్లు రాకతోపాటు నూతన కోచ్ క్రిషన్ కుమార్ చేరడంతో తెలుగు టైటాన్స్ గాడిలో పడుతుందని అభిమానులు ఆశపడుతున్నారు. ఇకపోతే ప్రో కబడ్డీ లీగ్ కు ఏటా ఆదరణ పెరుగుతుండడంతో దేశంలోని స్టార్ కబడ్డీ ప్లేయర్స్ కు భారీగా ఆదాయం సమకూరుతోంది. ఆయా ప్రాంచైజీలు మెరుగైన ఆట తీరును కనబరుస్తున్న ప్లేయర్స్ ను కొనుగోలు చేసుకునేందుకు భారీగా వెచ్చిస్తున్నాయి.
పికేఎల్-11 సీజన్ కోసం ఆయా ప్రాంచైజీలు ఎగబడి వేలంలో ప్లేయర్స్ ను కొనుగోలు చేశాయి. దీంతో ఈసారి ఏకంగా ఎనిమిది మంది ప్లేయర్స్ కు వేలంలో కోటి అంతకంటే ఎక్కువ ధర లభించింది. ఇద్దరు ప్లేయర్స్ రెండు కోట్ల కంటే ఎక్కువ ధర పలికారు. అత్యధికంగా సచిన్ తన్వర్ ఏకంగా 2.15 కోట్లు పలికాడు. పీకేఎల్ చరిత్రలో ఇదే అత్యధిక రేటు. తమిళ్ తలైవాస్ ఫ్రాంచైజీ అతడిని కొనుగోలు చేసింది. ఇక అతను తర్వాత మహమ్మద్రైజా శాద్ల్వోయీ చియానే రూ.2.07 కోట్లు పలికాడు. అతడిని హర్యానా స్టీలర్స్ సొంతం చేసుకొంది. గుమన్ సింగ్ ను గుజరాత్ జెయింట్స్ జట్టు రూ.1.97 కోట్లకు, పవన్ సెహ్రావత్ ను తెలుగు టైటాన్స్ రూ.1.72 కోట్లకు, భరత్ ను యూపీ యోధాస్ రూ.1.3 కోట్లకు, మణిందర్ సింగ్ ను బెంగాల్ వారియర్స్ రూ.1.15 కోట్లకు, అజింక్య అశోక్ పవర్ ను బెంగుళూరు బుల్స్ రూ.1.10 కోట్లకు, సునీల్ కుమార్ ను యూ ముంబా రూ.1.15 కోట్లు వెచ్చించి దక్కించుకున్నాయి. ప్రో కబడ్డీ 11వ సీజన్ మొత్తం ప్రైజ్ మనీ రూ.8 కోట్లుగా ఉంది. ఐదో సీజన్ నుంచి ప్రతి సీజన్ కు ఇంతే మొత్తం ప్రైజ్ మనీగా ఉంది. ఇందులో విన్నర్, రన్నరప్ తోపాటు ఆరో స్థానం వరకు నిలిచిన జట్టులోని ని ప్లేయర్స్ కు, రిఫరల్స్ కు ప్రైజ్ మనీ అందించనున్నారు. విజేతకు మూడు కోట్లు, రన్నరప్ జట్టుకు రూ.1.5 కోట్లు, మూడు, నాలుగు స్థానాల్లో ఒక్కొక్కరికి రూ.90 లక్షలు చొప్పున అందిస్తారు. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన ఒక్కో జట్టుకు రూ.45 లక్షలు అందించనున్నారు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కు రూ.15 లక్షలు, బెస్ట్ రైడర్ కు పది లక్షలు, ఉత్తమ డెబ్యుటెంట్ కు రూ.8 లక్షలు, బెస్ట్ రిఫరీకి ఒక్కొక్కరికి రూ.3.5 లక్షలు అందించనున్నారు.