తాను మెరుగైన ప్రదర్శన చేసినా భారత సెలెక్టర్లు పట్టించుకోలేదని టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ అన్నాడు. ఆ సమయంలో కాస్త బాధపడినా.. తనకు తాను సర్ది చెప్పుకున్నానని తెలిపాడు.
ఇషాన్ కిషన్
తాను మెరుగైన ప్రదర్శన చేసినా భారత సెలెక్టర్లు పట్టించుకోలేదని టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ అన్నాడు. ఆ సమయంలో కాస్త బాధపడినా.. తనకు తాను సర్ది చెప్పుకున్నానని తెలిపాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025ని ఇషాన్ కిషన్ సారథ్యంలోని జార్ఖండ్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. హర్యానాతో గురువారం జరిగిన ఫైనల్లో ఇషాన్ కిషన్ సారథ్యంలోని జార్ఖండ్.. 69 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్(49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్‌లతో 101) విధ్వంసకర శతకంతో జార్ఖండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఇషాన్ కిషన్.. ఫలితం ఆశించకుండా తన ప్రయత్నం తాను చేస్తున్నానని తెలిపాడు. ఈ విజయం తన జీవితంలో మరిచిపోలేని అద్భుతమైన క్షణమని చెప్పుకొచ్చాడు. ‘నేను భారత జట్టుకు ఎంపిక కానప్పుడు చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను బాగా రాణించినా.. నాకు అవకాశం దక్కలేదు. ఇంకా నేను మెరుగ్గా ఆడలేమోనని నాకు నేను చెప్పుకున్నాను. బహుషా జట్టును గెలిపించాలేమో.. సమష్టిగా రాణించాలేమోనని భావించాను. ఇలాంటి పరిస్థితుల్లో నిరాశకు గురవ్వకుండా చూసుకోవడం కీలకం’ అని తెలిపాడు.