ఐపీఎల్ 17వ సీజన్ విజేత కోల్‌కతా.. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన జట్టు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ముగిసింది. ఈ సీజన్ విజేతగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నిలిచింది. చెన్నైలోని చపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కోల్‌కతా జట్టు విజయం సాధించడం ద్వారా టైటిల్ ను సాధించింది.

ట్రోఫీతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సభ్యులు

ట్రోఫీతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సభ్యులు


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ముగిసింది. ఈ సీజన్ విజేతగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నిలిచింది. చెన్నైలోని చపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కోల్‌కతా జట్టు విజయం సాధించడం ద్వారా టైటిల్ ను సాధించింది. ఈ మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. బౌలింగ్ కు అనుకూలించిన పిచ్ పై కోల్‌కతా జట్టు బౌలర్లు విజృంభించారు. హైదరాబాద్ జట్టు బ్యాటర్లు ఏమాత్రం కోలుకోనికుండా వరుస విరామాల్లో వికెట్లు తీశారు. దీంతో హైదరాబాద్ జట్టు 113 పరుగులకే ఆల్ అవుట్ అయింది. హైదరాబాద్ జట్టులో కెప్టెన్ కమిన్స్ (24), మార్క్రమ్ (20) మాత్రమే నామమాత్రపు స్కోర్లు చేశారు. మిగిలిన ఆటగాళ్లు ఎవరు రాణించ లేకపోవడంతో హైదరాబాద్ జట్టు స్వల్ప స్కోర్ కే పరిమితం అయింది. కోల్‌కతా జట్టు బౌలర్లలో హర్షిత్ రెండు, రస్సెల్ మూడు, స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టారు. అద్భుతమైన బౌలింగ్ తో హైదరాబాద్ జట్టు పతనాన్ని స్టార్క్ ప్రారంభించాడు. 

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు దూకుడుగా ఆడి 10.3 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ నరైన్ (6) అవుట్ అయిన.. ఆ తర్వాత వచ్చిన వెంకటేష్ అయ్యర్ దూకుడుగా ఆడటంతో కోల్‌కతా జట్టు లక్ష్యం దిశగా వేగంగా కదిలింది. మూడో ఓవర్ లోనే వెంకటేష్ అయ్యర్ 4, 6, 6 పరుగులతో 20 రన్స్ రాబట్టాడు. ఆరో ఓవర్ లో వరుసగా 4, 4, 6, 4 కొట్టడం ద్వారా మరోసారి 20 పరుగులు సాధించాడు. దీంతో పవర్ ప్లే లో కోల్‌కతా జట్టు 72/1 తో నిలిచింది. 9వ వార్డులో గుర్బాజ్ కొట్టిన సిక్సర్ తో కోల్‌కతా జట్టు 100 పరుగులు దాటింది. అదే ఓవర్లో షాబాజ్ అతడిని ఎల్బీ చేయడంతో రెండో వికెట్ కు 91 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఆరు పరుగులు చేయగా, వెంకటేష్ అయ్యర్ 24 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10.3 ఓవర్ లో సింగిల్ తీయడం ద్వారా కోల్‌కతా జట్టు విజయాన్ని నమోదు చేసింది. అనంతరం కోల్‌కతా జట్టు సంబరాలు అంబరాన్ని అంటాయి. ఛాంపియన్ గా నిలిచిన కోల్‌కతా జట్టుకు రూ.20 కోట్లు, రన్నరప్ గా నిలిచిన హైదరాబాద్ జట్టుకు రూ.12.50 కోట్లు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు ఏడు, నాలుగు స్థానంలో నిలిచిన జట్టుకు రూ.6.5 కోట్లు ప్రైజ్ మనీ లభించింది. ఈ సీజన్లో అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టిన విరాట్ కోహ్లీ 741 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. బౌలింగ్ విభాగంలో అదరగొట్టిన పంజాబ్ బౌలర్ హర్షల్ 24 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. తాజా సీజన్ లో విజేతగా నిలిచిన కోల్‌కతా జట్టు మూడోసారి టైటిల్ ను కైవసం చేసుకుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్