IPL Final : సన్ రైజర్స్ బౌలింగ్‌పై గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు

IPL 2024 Final | SRH vs KKR | మంచి ఆటతో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫైనల్‌కు చేరింది. దాదాపు ప్రతి మ్యాచ్‌ను గెలుచుకుంటూ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కూడా ఫైనల్ చేరింది. ఆదివారం ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

gambhir on srh

గౌతమ్ గంభీర్

ఐపీఎల్-2024 (IPL) తుది అంకానికి చేరుకుంది. సిక్స్‌ల మోత, ఫోర్ల ప్రవాహంతో ఈ ఐపీఎల్ అభిమానులకు కావాల్సినంత కిక్ ఇచ్చింది. ముఖ్యంగా సరికొత్త రికార్డులు వచ్చి చేరాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఐపీఎల్ సాగింది. ముఖ్యంగా హాట్ ఫేవరెట్‌గా దిగిన ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్స్ ప్లే ఆఫ్‌కు చేరకుండానే ఇంటిముఖం పట్టాయి. మంచి ఆటతో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫైనల్‌కు చేరింది. దాదాపు ప్రతి మ్యాచ్‌ను గెలుచుకుంటూ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కూడా ఫైనల్ చేరింది. ఆదివారం ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఈ నేపథ్యంలో రెండు జట్ల బలాబలాలను గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) అంచనా వేశారు. ముఖ్యంగా ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్, బౌలింగ్‌పై స్పందించారు. ‘హైదరాబాద్ జట్టు ఐపీఎల్‌లో కొత్త స్కోర్‌ రికార్డులను సృష్టించింది. అయితే, ఆ జట్టులో బౌలర్లు కూడా ప్రమాదకరం. ఎస్ఆర్‌హెచ్‌లో భువనేశ్వర్ కుమార్ (Bhuvaneshwar Kumar), ప్యాట్ కమిన్స్ (Patt Cummins), నటరాజన్ (Natarajan) లాంటి క్వాలిటీ బౌలర్లు ఉన్నారు. ఆ జట్టు భారీ స్కోర్లు సాధిస్తోంది. అదే సమయంలో వారి బౌలింగ్ లైనప్ కూడా విధ్వంసకరంగానే ఉంది. ఒక్క విభాగంలో రాణించి ఏ జట్టూ ఫైనల్ చేరలేదు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ పదును ఎక్కువే’ అని వెల్లడించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్