SRH vs KKR | హైదరాబాద్‌కు హ్యాట్రిక్ ఓటమి.. కోల్‌కతా చేతిలో ఘోర పరాజయం

ఐపీఎల్ 2025లో ఓపెనింగ్ మ్యాచ్‌లోనే అద్భుత బ్యాటింగ్ చేసి.. గత ఐపీఎల్ సీజన్ దూకుడును కొనసాగిస్తుందనుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH).. వరుస ఓటములను మూటగట్టుకుంటోంది. తాజాగా, గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైంది.

srh vs kkr

హైదరాబాద్‌కు హ్యాట్రిక్ ఓటమి

ఐపీఎల్ 2025లో ఓపెనింగ్ మ్యాచ్‌లోనే అద్భుత బ్యాటింగ్ చేసి.. గత ఐపీఎల్ సీజన్ దూకుడును కొనసాగిస్తుందనుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH).. వరుస ఓటములను మూటగట్టుకుంటోంది. తాజాగా, గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైంది. దీంతో.. హ్యాట్రిక్ ఓటములు మూటగట్టుకుంది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ 80 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. 201 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌.. 16.4 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌట్ అయ్యింది. హైదరాబాద్ బ్యాటర్లలో క్లాసెన్‌ (33: 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మెండిస్‌ (27: 20 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రమే కాస్త బెటర్. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్‌ అరోరా 3, వరుణ్‌ చక్రవర్తి 3 వికెట్లతో హైదరాబాద్ బ్యాటర్ల వెన్ను విరిచారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (60; 29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), రఘువంశీ (50; 32 బంతుల్లో 2 సిక్సులు, 5 ఫోర్లు) చెలరేగి ఆడటంతో డబుల్ సెంచరీ స్కోర్ చేయగలిగింది. కెప్టెన్‌ అజింక్య రహానే (38), రింకుసింగ్‌ (32*) రాణించారు.హైదరాబాద్ బౌలర్లలో షమీ, కమిన్స్‌, జీషన్‌ అన్సారీ, హర్షల్‌ పటేల్‌, కమిందు మెండిస్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. హైదరాబాద్ తాజా ఓటమితో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. 4 మ్యాచ్‌లలో 3 మ్యాచ్‌లు ఓడిపోయింది. దీంతో నెట్ రన్‌రేట్ -1.612కు పడిపోయింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్