ఐపీఎల్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. తొలి మ్యాచ్‌ ఎప్పుడంటే.?

క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2025 షెడ్యూల్‌ విడుదల అయింది. ఈ మేరకు టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను కమిటీ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఈ టోర్నీలో మొత్తంగా 74 మ్యాచులు జరగనున్నాయి. ఈ ఏడాది తొలి మ్యాచ్‌ మార్చి 22న ప్రారంభం కానుంది. చివరి మ్యాచ్‌ మే 25న ముగియనుంది. మొత్తంగా 65 రోజులపాటు జరగనున్న ఈ టోర్నీలో 74 మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు జట్లు తలపడనున్నాయి.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2025 షెడ్యూల్‌ విడుదల అయింది. ఈ మేరకు టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను కమిటీ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఈ టోర్నీలో మొత్తంగా 74 మ్యాచులు జరగనున్నాయి. ఈ ఏడాది తొలి మ్యాచ్‌ మార్చి 22న ప్రారంభం కానుంది. చివరి మ్యాచ్‌ మే 25న ముగియనుంది. మొత్తంగా 65 రోజులపాటు జరగనున్న ఈ టోర్నీలో 74 మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ స్టేడియం వేదిక కానుంది. రెండోరోజైన మార్చి 23న ఉప్పల వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు తలపడతాయి. ఈ ఏడాది కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంబంధించిన కొన్ని మ్యాచులు విశాఖ వేదికగా జరగనున్నాయి. మార్చి 24న ఢిల్లీ, లక్నో మధ్య, 30న సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య విశాఖ వేదిక మ్యాచ్‌లు జరగనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో తొమ్మిది మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్‌ షెడ్యూల్‌తోపాటు నాకౌట్‌ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. మే 20 న క్వాలిఫయర్‌ -1, 21న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు కూడా హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఐపీఎల్‌ 18వ సీజన్‌ షెడ్యూల్‌ విడుదల కావడంతో క్రికెట్‌ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మహిళల క్రికెట్‌ లీగ్‌ జరుగుతోంది. ఇది ముగిసిన వెంటనే పురుషుల క్రికెట్‌ లీగ్‌ ఐపీఎల్‌ గ్రాండ్‌గా ప్రారంభమవుతుంది. ఈలోగా చాంపియన్స్‌ లీగ్‌ కూడా జరగనుంది. అంటే ఈ వేసవి మొత్తం క్రికెట్‌ అభిమానులకుగా పండగ అనే చెప్పాలి. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్