వరుస గెలుపులతో జోరు మీదున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు గుజరాత్ టైటాన్స్ షాకిచ్చింది. బుధవారం బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండ్ షోతో ఆర్సీబీని మట్టికరిపించింది.
ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: వరుస గెలుపులతో జోరు మీదున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు గుజరాత్ టైటాన్స్ షాకిచ్చింది. బుధవారం బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండ్ షోతో ఆర్సీబీని మట్టికరిపించింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆర్సీబీ నిర్దేశించిన 170 పరుగులను గుజరాత్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (73) సిక్సుల వర్షం కురిపించాడు. 39 బంతుల్లోనే 6 సిక్సులు, 5 ఫోర్లతో గుజరాత్‌ను గెలిపించాడు. మరో బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రూథర్‌ఫర్డ్ (30) కూడా రాణించాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు ఆదిలోనే దెబ్బ తగిలింది. వరుస ఓవర్లలో కోహ్లీ (7), దేవదత్ పడిక్కల్ (4), పాండ్యా (5), సాల్ట్ (14), రజత్ పాటీదార్ (12) తక్కువ స్కోరుకే అవుట్ అయ్యారు. అయితే, లివింగ్‌స్టోన్ (54), జితేశ్ శర్మ (33), టిమ్ డేవిడ్ (32) దూకుడుగా ఆడారు.
లివింగ్‌స్టోన్, డేవిడ్ దూకుడు
లివింగ్‌స్టోన్ రషీద్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని సిక్సర్ల మోత మోగించాడు. అతడు వేసిన 16 ఓవర్‌లో లివింగ్‌స్టోన్ ఒక సిక్స్, డేవిడ్ ఒక ఫోర్ కొట్టారు. సాయి కిశోర్ వేసిన 17 ఓవర్‌లో డేవిడ్ సిక్స్ కొట్టాడు. రషీద్ ఖాన్ వేసిన 18 ఓవర్‌లో లివింగ్‌స్టోన్ మూడు సిక్సర్లు బాదాడు. 19 ఓవర్‌లో సిరాజ్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్ ఔట్ అయ్యాడు. అయితే, 20వ ఓవర్‌లో ప్రసిద్ధ వేసిన చివరి ఓవర్‌లో టిమ్ డేవిడ్ 4, 6, 4 బాదాడు. చివరి ఐదు ఓవర్లలో ఆర్సీబీ 63 పరుగులు రాబట్టింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ (3/19) అద్భుత బౌలింగ్ చేశాడు.