IPL 2025 MI vs RCB | ఆర్సీబీ బ్యాటర్ల జోరు.. తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా భయపెట్టినా..

IPL 2025 MI vs RCB | టాస్ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయింది. ఫిల్ సాల్ట్‌ను బౌల్ట్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన పడిక్కల్ దూకుడుగా ఆడాడు. దీపక్ చాహర్ వేసిన ఆరో ఓవర్‌లో 6, 6, 4 కొట్టాడు. అటు.. విరాట్ కోహ్లీ కూడా చెలరేగి ఆడాడు.

virat vs bumrah

విరాట్ కోహ్లీ వర్సెస్ బూమ్రా

IPL 2025 MI vs RCB | ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. కీలక దశలో వికెట్లు కోల్పోవడంతో 12 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. ముంబై చివరి వరకు పోరాడినా.. గెలవలేకపోయింది. ఒకానొక దశలో బెంగళూరును హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ భయపెట్టారు. ఈ ఐపీఎల్‌లో తిలక్ వర్మ తొలి ఫిఫ్టీ చేయగా, హార్దిక్ పాండ్యా ఉన్నంత సేపు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 15 బంతుల్లో 42 పరుగులు చేశాడు. అందులో 4 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. అయితే, కీలక దశలో వీరిద్దరు అవుట్ కావడంతో ఒక్కసారిగా ముంబై గెలుపు ఆశలు తగ్గిపోయాయి. ఆర్సీబీ బౌలర్లలో కృణాల్ పాండ్యా 4 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్ 1, యశ్ దయాల్ 2, హేజల్ వుడ్ 2 వికెట్లు తీశారు. 

టాస్ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయింది. ఫిల్ సాల్ట్‌ను బౌల్ట్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన పడిక్కల్ దూకుడుగా ఆడాడు. దీపక్ చాహర్ వేసిన ఆరో ఓవర్‌లో 6, 6, 4 కొట్టాడు. అటు.. విరాట్ కోహ్లీ కూడా చెలరేగి ఆడాడు. బుమ్రా బౌలింగ్‌లో సిక్స్ బాదిన కోహ్లీ.. విఘ్నేశ్‌ వేసిన 9వ ఓవర్‌లో సిక్స్ కొట్టి హాఫ్‌ సెంచరీ (29 బంతుల్లో) పూర్తి చేశాడు. అదే ఓవర్‌లో పడిక్కల్ ఔట్ కావడంతో 91 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌కు తెరపడింది. రజత్ పాటీదార్ కూడా శాంట్నర్‌ బౌలింగ్‌లో రెండు భారీ సిక్స్‌లు కొట్టాడు. హార్దిక్ వేసిన 15 ఓవర్లో కోహ్లీ, లివింగ్‌స్టన్ (0) ఔట్ అయినా.. పాటీదార్ దూకుడు కొనసాగించాడు. హార్దిక్ వేసిన 17 ఓవర్‌లో వరుసగా 6, 6, 4 ఝలిపించాడు. ఆ ఓవర్‌లో 23 రన్స్ వచ్చాయి. మరో ఎండ్‌లో జితేశ్‌ శర్మ కూడా దుమ్ముదులిపాడు. బౌల్ట్ వేసిన 19 ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదాడు. అదే ఓవర్‌లో చివరి బంతికి పాటిదార్ ఔట్ అయ్యాడు. బుమ్రా వేసిన చివరి ఓవర్లో 8 రన్స్ వచ్చాయి. దీంతో బెంగళూరు 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.

రోహిత్ శర్మ.. మళ్లీ..!

ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరోసారి నిరాశ పరిచాడు. ఈ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఏ ఒక్క మ్యాచ్‌లోనూ రాణించలేదు. ఈ రోజు మ్యాచ్‌లో 9 బంతుల్లోనే 17 పరుగులు (ఒక సిక్స్, ఒక ఫోర్) చేసినా, దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. దీంతో సోషల్ మీడియాలో రోహిత్ శర్మ పేరును ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో రోహిత్ శర్మ ట్యాగ్ జోరుగా ట్రెండ్ అవుతోంది. రిటైర్మెంట్‌కు సమయం ఆసన్నమైంది అన్నట్లుగా పోస్టులు పెడుతున్నారు. మరోవైపు.. రోహిత్ సహచరుడు విరాట్ కోహ్లీ దుమ్ములేపుతుంటే.. రోహిత్ శర్మ విఫలం కావడం అభిమానుల్లో అసహనం వ్యక్తం అవుతోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్