ఐపీఎల్‌లో హాట్ ఫేవరెట్ జట్లు ఏవో చెప్పడం కష్టంగా మారుతోంది. ఫేవరెట్‌గా బరిలోకి దిగే జట్లు.. ఓడిపోతున్నాయి. ఓడిపోతాయనుకున్న జట్లు గెలుస్తున్నాయి. తాజాగా, ముంబైతో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఉత్కంఠ భరిత విజయాన్ని సాధించింది.
ఐపీఎల్‌లో హాట్ ఫేవరెట్ జట్లు ఏవో చెప్పడం కష్టంగా మారుతోంది. ఫేవరెట్‌గా బరిలోకి దిగే జట్లు.. ఓడిపోతున్నాయి. ఓడిపోతాయనుకున్న జట్లు గెలుస్తున్నాయి. తాజాగా, ముంబైతో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఉత్కంఠ భరిత విజయాన్ని సాధించింది. 12 పరుగుల తేడాతో ముంబైపై గెలుపొందింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హార్దిక్ సేన 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులే చేయగలిగింది. ముంబయి విజయానికి చివరి ఓవర్లో 22 పరుగులు అవసరం కాగా, హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నా.. అవేశ్ ఖాన్ అద్భుత బౌలింగ్‌తో చివరి ఓవర్లో 9 పరుగులే ఇచ్చాడు. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (67), నమన్ ధీర్ (46) రాణించారు. లక్నో బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, దిగ్వేష్, అవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (60), మార్క్రమ్ (53) హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగతా బ్యాటర్లలో పూరన్ 12, పంత్ 2, బదోనీ 30, మిల్లర్ 27, సమద్ 4, శార్దూల్ 5, ఆకాశ్‌దీప్ 0, అవేశ్ 2 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో పాండ్యా అద్భుత బౌలింగ్ చేశాడు. ఏకంగా 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. విఘ్నేశ్, అశ్వనీ, బౌల్ట్ తలో వికెట్ తీశారు.