మంగళవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాన్ని సాధించింది. 8 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది.
లక్నోపై పంజాబ్ గెలుపు
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్ : గత ఐపీఎల్స్‌కు భిన్నంగా పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాలు సాధిస్తోంది. శ్రేయస్ అయ్యర్ లాంటి యంగ్ కెప్టెన్ సారథ్యంలో విక్టరీలు ఖాతాలో వేసుకుంటోంది. తాజాగా, మంగళవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని సాధించింది. 8 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. ముందు బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ (44), బదోనీ (41), మార్క్రమ్(28), అబ్దుల్ సమద్ (27), డేవిడ్ మిల్లర్ (19) పరుగులు చేశారు. మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ తీవ్రంగా నిరాశ పరిచారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీశాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 16.2 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ (69), శ్రేయస్ అయ్యర్ (52*), వదేరా (42*) వీర విహారం చేశారు. దీంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ రెండో స్థానానికి చేరింది. ప్రస్తుతం బెంగళూరు టాప్‌లో ఉంది.