భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025ను నిరవధిక వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025ను నిరవధిక వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ నిర్వహిస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నామని వెల్లడించింది. అటు.. గురువారం ధర్మశాలలో జరిగే పంజాబ్- ఢిల్లీ మ్యాచ్‌ను అర్ధంతరంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ జరుగుతుండగానే మధ్యలోనే సాంకేతిక కారణాలతో నిలిపివేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే, ఉద్రిక్తతల నేపథ్యంలోనే మ్యాచ్‌ను రద్దు చేసినట్లు స్పష్టత వచ్చింది. ప్రేక్షకులను స్టేడియం నుంచి క్షేమంగా బయటికి పంపిన వెంటనే ధర్మశాలలో బ్లాక్ అవుట్ చేపట్టారు.