GT vs MI | ఉత్కంఠ భరిత పోరులో గుజరాత్ విజయం.. ఆకట్టుకున్న ముంబై పోరాటం

GT vs MI | మంగళవారం రాత్రి జరిగిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో అలాంటి మజాయే వచ్చింది. దానికి తోడు వర్షం కూడా గెలుపుతో దోబూచులాడటంతో మరింత మజా అనిపించింది.

gt vs mi

గుజరాత్ వర్సెస్ ముంబై ఇండియన్స్

క్రికెట్ మజా అంటే ఇలాగే ఉండాలి.. ప్రతి బాల్‌కు సిక్సులు, ఫోర్లు కొడితే ఏమొస్తది. ఆట మీద ఇంట్రెస్ట్ పోతది. చివరి బంతి దాకా గెలుపు నీదా? నాదా? అన్నట్లు మ్యాచ్ సాగితే..? చివరి బంతికి ఫలితం తేలితే.. ఆ మజాయే వేరు. మంగళవారం రాత్రి జరిగిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో అలాంటి మజాయే వచ్చింది. దానికి తోడు వర్షం కూడా గెలుపుతో దోబూచులాడటంతో మరింత మజా అనిపించింది. వివరాల్లోకెళితే.. ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ ఉత్కంఠ భరిత విజయం సాధించింది. మ్యాచ్‌కు వర్షం అడ్డంకితో 19 ఓవర్ల మ్యాచ్‌లో చివరి బంతికి రన్ తీసి గుజరాత్ గెలుపును ముద్దాడింది. 156 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన గుజరాత్‌ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. అయితే.. బట్లర్, గిల్ ఇన్నింగ్ నిర్మించారు. సాఫీగా సాగుతున్న మ్యాచ్‌కు వర్షం అడ్డు పడింది. అయితే..14 ఓవర్లకు 107/2తో గుజరాత్‌ పటిష్ట స్థితిలో ఉండగా వర్షం వల్ల తొలిసారి మ్యాచ్‌ ఆగింది. ఆ సమయంలో శుభ్‌మన్‌ గిల్ 38 పరుగులతో, రూథర్‌ఫర్డ్‌ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లలో 49 పరుగులే చేయాలి. కానీ, మ్యాచ్ మళ్లీ మొదలుకాగానే కథ మొత్తం మారిపోయింది. బంతి అందుకున్న బుమ్రా.. నిప్పులు చెరిగే బంతులతో గుజరాత్‌కు చుక్కలు చూపించాడు. 2 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చి గిల్, షారుఖ్‌ ఖాన్‌ను బౌల్డ్‌ చేశాడు. రూథర్‌ఫర్డ్‌ను బౌల్ట్‌ పెవిలియన్‌ పంపాడు. రషీద్‌ ఖాన్‌ (2) సైతం ఎంతోసేపు నిలవలేదు. 18 ఓవర్లకు 132/6తో టైటాన్స్‌ ఓటమి బాటలో సాగుతున్న దశలో మరోసారి వర్షం వల్ల మ్యాచ్ ఆగింది. అయితే, మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. చివరి ఓవర్‌లో 15 పరుగులు చేయాల్సిన దశలో తొలి బంతికి ఫోర్‌ కొట్టిన తివాతియా.. రెండో బంతికి సింగిల్‌ తీశాడు. మూడో బంతికి కొయెట్జీ సిక్సర్‌ కొట్టాడు. నాలుగో బంతికి సింగిల్‌ వచ్చింది. అది నోబాల్‌. తర్వాత తెవాతియా సింగిల్‌ తీశాడు. 2  బంతుల్లో 1 పరుగే చేయాల్సి ఉండగా.. కొయెట్జీ అయిదో బంతికి ఔట్ అయ్యాడు. అయితే, చివరి బంతికి అర్షద్‌ ఖాన్‌ సింగిల్‌ తీసి గుజరాత్‌ను గెలిపించాడు.
అంతకుముందు.. ముంబై ఇండియన్స్ సొంత గడ్డ వాంఖడే స్టేడియంలో ముంబై బ్యాటర్లను గుజరాత్ బౌలర్లు కట్టడి చేశారు. టాపార్డర్‌లో విల్‌ జాక్స్‌(53) హాఫ్ సెంచరీ చేసినా.. మిడిల్ ఆర్డర్ అంతగా ఆకట్టుకోకపోవడంతో కేవలం 155 పరుగులే చేసింది. చివర్లో కార్బిన్ బాస్చ్ బ్యాట్ ఝలిపించడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 6 విజయాలతో జోరుమీదున్న ముంబై.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. అయితే.. గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్ల ధాటికి ప్రధాన ఆటగాళ్లు తేలిపోయారు. పవర్‌ ప్లేలో గుజరాత్ ఫీల్డర్లు మూడు క్యాచ్‌లు వదిలేసినా ముంబై భారీ స్కోర్‌ చేయలేకపోయింది. ముంబైకి సిరాజ్‌ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్‌ రియాన్‌ రికెల్టన్‌(2)ను ఔట్‌ చేశాడు. ఆ తర్వాత బంతికే విల్‌ జాక్స్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను సుదర్శన్‌ నేలపాలు చేశాడు. లైఫ్‌ లభించడంతో జాక్స్‌ బౌండరీలతో రెచ్చిపోయాడు. మరో ఎండ్‌లో ఉన్న రోహిత్‌ శర్మ(7)ను అర్షద్‌ పెవిలియన్‌ పంపాడు. ఆ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌(35)తో కలిసి జాక్స్‌ ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అయితే.. సూర్య కుమార్ యాదవ్‌ను సాయి కిశోర్‌ ఔట్‌ చేసి జోడీని విడదీశాడు. ఆ తర్వాత కాసేపటకే జాక్స్‌ను రషీద్‌ ఖాన్‌ పెవిలియన్‌ పంపాడు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(1), తిలక్‌ వర్మ (7), నమన్‌ ధిర్‌(7) విఫలం అయ్యారు.

సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్