IPL 2025 GT vs RR | సాయి సుదర్శన్ బ్యాటింగ్.. ప్రసీద్ కృష్ణ బౌలింగ్.. గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండ్ షో

సాయి సుదర్శన్ బ్యాటింగ్‌తో అదరగొట్టగా, ప్రసీద్ కృష్ణ బౌలింగ్‌తో బెదరగొట్టాడు. మొత్తంగా ఆల్ రౌండ్ షోతో గుజరాత్ టైటాన్స్ వరుసగా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. హ్యాట్రిక్ గెలుపు సాధిద్దామనుకున్న రాజస్థాన్ రాయల్స్‌కు షాక్ ఇచ్చింది.

gt vs rr
గుజరాత్ గెలుపు gt vs rr

సాయి సుదర్శన్ బ్యాటింగ్‌తో అదరగొట్టగా, ప్రసీద్ కృష్ణ బౌలింగ్‌తో బెదరగొట్టాడు. మొత్తంగా ఆల్ రౌండ్ షోతో గుజరాత్ టైటాన్స్ వరుసగా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. హ్యాట్రిక్ గెలుపు సాధిద్దామనుకున్న రాజస్థాన్ రాయల్స్‌కు షాక్ ఇచ్చింది. 58 పరుగుల తేడాతో సంజూ శాంసన్ సేనను మట్టికరిపించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్.. 20 ఓవర్లలో 217 పరుగులు చేసింది. ఆ జట్టులో సాయి సుదర్శన్‌ (82, 53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఆర్చర్ గిల్ (2) వికెట్ తీసి షాకిచ్చినా.. మరో ఎండ్‌లో సాయి సుదర్శన్ పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడాడు. దూకుడును తగ్గించకుండా.. ఆటను కొనసాగించాడు. బట్లర్ (36) కూడా రాణించడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. షారుఖ్ ఖాన్ (36), రాహుల్ తివాతియా (24 నాటౌట్) వేగంగా ఆడటంతో స్కోరు బోర్డు 200 దాటింది.

218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. 19.2 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్‌ అయింది. హిట్మెయిర్ (52), సంజు శాంసన్‌ (41), రియాన్‌ పరాగ్‌ (26) మాత్రమే ఫర్వాలేదనిపించారు. గుజరాత్ బౌలర్లలో ప్రసీద్ కృష్ణ 3, రషీద్‌ ఖాన్‌ 2, సాయి కిశోర్‌ 2, సిరాజ్‌, అర్షద్‌ ఖాన్‌, కుల్వంత్‌ కెజ్రోలియా తలో వికెట్‌ తీశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్