GT vs KKR | గుజరాత్ ఘనంగా.. గిల్ సేన ఖాతాలో ఆరో గెలుపు.. చిత్తుగా ఓడిన KKR

సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ ఓటమిని చవి చూసింది. ఏకంగా 39 పరుగుల తేడాతో ఓడిపోయింది.

gt vs kkr

కోల్‌కతాపై గుజరాత్ గెలుపు

సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ ఓటమిని చవి చూసింది. ఏకంగా 39 పరుగుల తేడాతో ఓడిపోయింది. మంచి ఊపు మీద ఉన్న గిల్ సేన.. ఆరో విజయాన్ని అందుకొని టేబుల్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఆరు విజయాలు అందుకున్న గుజరాత్.. ప్రస్తుతం 12 పాయింట్లు సాధించింది. ఇక.. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 198 పరుగులు చేసింది. ఆ టీమ్ బ్యాటర్లలో శుభ్మన్ గిల్ (90), సాయి సుదర్శన్ (52) అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 114 పరుగులు చేశారు. జోస్ బట్లర్ మరోసారి విరుచుకుపడ్డాడు. 23 బంతుల్లోనే 41 పరుగులు చేయడంతో గుజరాత్ భారీ స్కోరును సాధించింది.

199 పరుగుల లక్ష్యచేధనలో బరిలోకి దిగిన కోల్‌కతా 159 పరుగులకే పరిమితం అయ్యింది. ఆ జట్టు కెప్టెన్ అజింక్యా రహానే ఒక్కడే రాణించాడు. 36 బంతుల్లో 50 పరుగులు చేశాడు. కోల్‌కతా బ్యాటర్లలో రస్సెల్‌ (21), రఘువంశీ (27*), రింకు సింగు (17) రన్స్ మాత్రమే చేయగలిగారు. ప్రస్తుతం కోల్‌కతా టేబుల్‌లో 6 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. 8 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్.. 3 మ్యాచ్‌లలోనే విజయం సాధించింది.  గుజరాత్‌ టైటాన్స్ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ 2, ప్రసిద్ధ్‌ కృష్ణ 2, సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్, సాయి కిశోర్‌, ఇషాంత్‌ శర్మ తలో వికెట్‌ తీశారు.

అన్ని జట్ల ర్యాంకులను పరిశీలిస్తే.. (ప్రస్తుతం)

1. గుజరాత్ టైటాన్స్ GT (12 పాయింట్లు)

2. ఢిల్లీ క్యాపిటల్స్ DC (10 పాయింట్లు)

3. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు RCB (10 పాయింట్లు)

4. పంజాబ్ కింగ్స్ PBKS (10 పాయింట్లు)

5. లక్నో సూపర్ జెయింట్స్ LSG (10 పాయింట్లు)

6. ముంబై ఇండియన్స్ MI (8 పాయింట్లు)

7. కోల్‌కతా నైట్ రైడర్స్ KKR (6 పాయింట్లు)

8. రాజస్థాన్ రాయల్స్ RR (4 పాయింట్లు)

9. సన్ రైజర్స్ హైదరాబాద్ SRH (4 పాయింట్లు)

10. చెన్నై సూపర్ కింగ్స్ CSK (4 పాయింట్లు)


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్