లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ సునాయస విజయం.. టేబుల్‌లో టాప్ 2

మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సునాయస విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే ఛేదించింది.

dc vs lsg

ఢిల్లీ సునాయస విజయం

మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సునాయస విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే ఛేదించింది. అభిషేక్ పోరెల్ (51), కేఎల్ రాహుల్ (57 నాటౌట్), అక్షర్ పటేల్ (34 నాటౌట్‌) దూకుడైన బ్యాటింగ్‌తో 8 వికెట్ల తేడాలో ఘన విజయాన్ని అందుకుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో బ్యాటర్లు అద్భుతమైన ఓపెనింగ్ ఇచ్చినా దాన్ని మిగతా బ్యాటర్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఓపెనర్లు మార్క్రమ్ 52, మిచెల్ మార్ష్ 45 బాగా ఆడారు. వారిద్దరు కలిసి తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించారు. అయితే, తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పూరన్, అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్ రాణించలేదు. ఆయుష్ బదోనీ 36 (21 బంతుల్లో) ఫర్వాలేదనిపించాడు. చివరి రెండు బంతులు ఆడిన పంత్.. ఇన్నింగ్స్ చివరి బంతికి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్‌కు 4 వికెట్లు దక్కాయి.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ బ్యాటర్లు.. ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని పూర్తి చేశారు. అభిషేక్ పోరెల్ 51 (36 బంతుల్లో) దూకుడుగా ఆడాడు. కరుణ్ నాయర్ త్వరగానే అవుట్ అయినా.. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ కలిసి అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అక్షర్ పటేల్ అయితే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో స్కోరు చిన్నదైపోయింది. లక్నో బౌలర్లలో మార్క్రమ్ రెండు వికెట్లు తీశాడు.

అన్ని జట్ల ర్యాంకులను పరిశీలిస్తే.. (ప్రస్తుతం)

1. గుజరాత్ టైటాన్స్ GT (12 పాయింట్లు)

2. ఢిల్లీ క్యాపిటల్స్ DC (12 పాయింట్లు)

3. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు RCB (10 పాయింట్లు)

4. పంజాబ్ కింగ్స్ PBKS (10 పాయింట్లు)

5. లక్నో సూపర్ జెయింట్స్ LSG (10 పాయింట్లు)

6. ముంబై ఇండియన్స్ MI (8 పాయింట్లు)

7. కోల్‌కతా నైట్ రైడర్స్ KKR (6 పాయింట్లు)

8. రాజస్థాన్ రాయల్స్ RR (4 పాయింట్లు)

9. సన్ రైజర్స్ హైదరాబాద్ SRH (4 పాయింట్లు)

10. చెన్నై సూపర్ కింగ్స్ CSK (4 పాయింట్లు)


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్