కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సమష్టిగా రాణించింది. చెన్నైని 154 పరుగులకే నిలువరించి.. బరిలోకి దిగి.. 5 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తిచేసింది.
చెన్నై, ఈవార్తలు: కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సమష్టిగా రాణించింది. చెన్నైని 154 పరుగులకే నిలువరించి.. బరిలోకి దిగి.. 5 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తిచేసింది. ఇషాన్ కిషన్ (44) రాణించాడు. అభిషేక్ శర్మ (0) ఆదిలోనే అవుట్ అయినా ట్రావిస్ హెడ్ (19), అనికేత్ వర్మ (19), ఫర్వాలేదనిపించారు. క్లాసెన్ 7 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. అయితే.. కమిందు మెండిస్ (32 నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 2, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు సన్‌రైజర్స్ షాక్ ఇచ్చింది. పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు తీసింది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ చెన్నైని నిలువరించింది. మహ్మద్ షమీ ఆదిలోనే దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ షేక్ రషీద్(0)ను ఔట్ చేశాడు. బంతిని స్లిప్‌లో ఆడిన రషీద్.. అభిషేక్ శర్మ చేతికి చిక్కాడు. అవతలి ఎండ్‌లో ఆయుష్ మాత్రే (30) మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కమిన్స్ బౌలింగ్‌లో రెండు ఫోర్లతో చెలరేగాడు. అయితే, మిడిల్ ఆర్డర్‌ను హర్షల్ పటేల్ దెబ్బతీశాడు. చెన్నైని డెవాల్డ్ బ్రెవిస్ (42), రవీంద్ర జడేజా(21) ఆదుకున్నా.. ధాటిగా ఆడుతున్న జడ్డూను కమింద్ మెండిస్ బౌల్డ్ చేయడంతో సీఎస్కే కోలుకోలేకపోయింది. బ్రెవిస్ మెరుపులకు హర్షల్ పటేల్ కాసేపటికే ముగింపు పలికాడు. హర్షల్ బౌలింగ్‌లోనే ధోనీ(6), నూర్ అహ్మద్(2) పెవిలియన్ చేరారు. వరుసగా వికెట్లు కోల్పోయిన చెన్నైకి దీపక్ హుడా(22) చివర్లో పోరాడి బెటర్ స్కోర్ అందించాడు. 154 రన్స్‌కు చెన్నై ఆలౌటయ్యింది.