కెప్టెన్ మారినా.. రాత మారని చెన్నై.. వంద దాటేందుకే నానాతిప్పలు

కెప్టెన్ మారినా చెన్నై మాత్రం ఓటముల నుంచి బయట పడలేదు. పైగా, ఈ సారి 100 పరుగులు దాటేందుకే నానాతిప్పలు పడింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 103 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ అలవోకగా ఛేదించింది.

csk vs kkr
సీఎస్కే‌పై కేకేఆర్ గెలుపు

కెప్టెన్ మారినా చెన్నై మాత్రం ఓటముల నుంచి బయట పడలేదు. పైగా, ఈ సారి 100 పరుగులు దాటేందుకే నానాతిప్పలు పడింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 103 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ అలవోకగా ఛేదించింది. 10.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను పూర్తి చేసింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో గెలిచింది. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. శివమ్‌(31), విజయ్‌ శంకర్‌(26) మినహా ఎవరూ రాణించలేదు. ఈ సీజన్‌లో తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీ.. 1 పరుగే చేసి ఔట్ అయ్యాడు. మిగతా బ్యాటర్లలో రచిన్‌ 4, కాన్వే 12, రాహుల్‌ త్రిపాఠి 16, అశ్విన్‌ 1, జడేజా 0, దీపక్‌ హుడా 0, నూర్‌ అహ్మద్‌ 1, అన్షుల్‌ 3 రన్స్ మాత్రమే చేశారు. కోల్‌కతా బౌలర్లలో సునీల్‌ నరైన్‌ 3, వరుణ్‌ 2, హర్షిత్‌ రాణా 2, అలీ 1, వైభవ్‌ 1 వికెట్లు తీశారు. 103 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ బ్యాటర్లు.. ఈజీగా లక్ష్యాన్ని ఛేదించారు. సునీల్‌ నరైన్‌ (44), డికాక్‌ (23) రాణించారు. చెన్నై బౌలర్లలో అన్షుల్‌, నూర్‌ అహ్మద్‌ ఒక్కో వికెట్‌ తీశారు. ఈ రోజు మ్యాచ్ ఓటమితో.. చెన్నై వరుసగా 5 మ్యాచ్‌లు ఓడిపోయినట్లైంది.

చరిత్ర సృష్టించిన ధోని

గాయం వల్ల సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొత్తం సిరీస్‌కు దూరం అయ్యాడు. దీంతో కెప్టెన్సీ బాధ్యతలు ధోనీకి అప్పగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అయితే, ఐపీఎల్ చరిత్రలో అన్‌క్యాప్డ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి ఆటగాడిగా ధోనీ నిలిచాడు. ఇప్పటి వరకు ఏ అన్‌ క్యాప్డ్ ప్లేయర్ కూడా ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరించలేదు.

అన్‌క్యాప్ట్ ప్లేయర్ అంటే..

ఐపీఎల్ 2025కి ముందు బీసీసీఐ ఈ నియమాన్ని తీసుకొచ్చింది. వాస్తవానికి ఏ ఆటగాడైనా 4 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం భారత జట్టుకు దూరంగా ఉంటే అతడిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణిస్తారు. ధోని చివరిసారిగా 2019లో భారత్ తరపున ఆడాడు. అనంతరం రిటైర్మెంట్ ప్రకటించాడు. అంటే.. ధోనీ భారత్ తరఫున ఆడి 5 ఏళ్లు అయ్యింది.  ఐపీఎల్ 2025లో ధోనీ అన్‌క్యాప్డ్ ప్లేయర్ అన్నమాట. ఇక.. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అతిపెద్ద వయసు ఆటగాడిగానూ ధోనీ నిలిచాడు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్