IPL 2025 | చెన్నైకి హ్యాట్రిక్ లాస్.. ఢిల్లీకి హ్యాట్రిక్ విన్.. పంజాబ్‌కు హ్యాట్రిక్ మిస్

ఐపీఎల్-18లో భాగంగా శనివారం జరిగిన డబుల్ ధమాకా మ్యాచ్‌లో హ్యాట్రిక్ అనే అంశం హైలైట్‌గా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన రెండు మ్యాచుల్లో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి.

csk vs dc and pbks vs rr

ప్రతీకాత్మక చిత్రం

ఐపీఎల్-18లో భాగంగా శనివారం జరిగిన డబుల్ ధమాకా మ్యాచ్‌లో హ్యాట్రిక్ అనే అంశం హైలైట్‌గా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన రెండు మ్యాచుల్లో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. ముందుగా, చెన్నై-ఢిల్లీ మ్యాచ్ జరగగా.. చెన్నైపై ఢిల్లీ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా చెన్నై వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోగా, ఢిల్లీ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఇక.. పంజాబ్-రాజస్థాన్ మ్యాచ్‌లో పంజాబ్ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 50 పరుగుల తేడాతో గెలిచింది.

చివరి వరకు క్రీజులో ధోనీ ఉన్నా..

CSK VS DC మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అనంతరం 184 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులకే ఆలౌట్‌ అయింది. కేఎల్ రాహుల్‌ 51 బంతుల్లో 77 పరుగులు చేశాడు. అభిషేక్‌ పొరేల్‌ 20 బంతుల్లో 33 పరుగులు, అక్షర్‌ పటేల్‌ (21), సమీర్‌ రిజ్వి (15), ట్రిస్టాన్‌ స్టబ్స్‌ (24) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్ (2/25) వికెట్లు తీశాడు. 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై.. ఆరంభంలోనే చతికిలబడింది. 2 ఓవర్లు కూడా పూర్తి అవకుండానే ముఖేష్‌ బౌలింగ్‌లో రచిన్‌ రవీంద్ర 3 పరుగులకే ఔట్‌ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ కూడా 5 పరుగుల స్వల్ప వ్యక్తిగత స్కోర్‌ వద్దే వికెట్‌ కోల్పోయాడు. 74 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తరువాత మహేంద్ర సింగ్‌ ధోనీ క్రీజులోకి వచ్చాడు. అప్పటికి చెన్నై గెలవడానికి 56 బంతుల్లో 110 పరుగులు చేయాల్సి ఉంది. 26 బంతుల్లో 30 పరుగులు చేసిన ధోనీ కూడా నాటౌట్‌గానే మిగిలాడు. నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులే చేయడంతో చెన్నై జట్టు ఢిల్లీచేతిలో 25 పరుగుల తేడాతో ఓడిపోయింది.

పంజాబ్‌కు రాజస్థాన్ షాక్

ఈ ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ విజయాలు సాధించాలని ఉవ్విళ్లూరిన పంజాబ్ కింగ్స్‌కు రాజస్థాన్‌ రాయల్స్ షాక్ ఇచ్చింది. పంజాబ్‌పై రాజస్థాన్ 50 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో పంజాబ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులే చేసింది. నేహాల్‌ వధేరా (62) మాత్రమే రాణించాడు. రాజస్థాన్‌ బౌలర్లలో ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కుమార్ కార్తికేయ, వానిందు హసరంగ చెరో వికెట్‌ తీశారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు జైస్వాల్‌ (67), సంజు శాంసన్ (38) శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో రియాన్ పరాగ్ (43; 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిశాడు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్